loading...
రాష్ట్రంలో.... కాదు కాదు దేశంలోనే పేరున్న వ్యక్తి, కోట్ల మంది అభిమానులు, వేలకోట్ల ఆస్తి, ఒక్క కాల్ తో CM చేత తనపని ముగించుకోగలిగిన కెపాసిటీ, సామాజికంగా అత్యంత బలమైన అతిపెద్ద కుటుంబం...కన్నబిడ్డ ప్రేమించిన వ్యక్తితో ఇల్లుదాటివెళ్తే బాధని తమవరకే ఉంచుకున్నారు. ఆబిడ్డ మీడియాకెక్కినా, తమ మీద ఆరోపణలు చేసినా ఒక్కమాట మాట్లాడలేదు. అదే బిడ్డ కొన్నేళ్ల తరువాత కష్టంలో ఉండి వెనక్కిచూస్తే పక్కనే వున్నాడు ఆతండ్రి. ఎవడేం అనుకున్నా పర్లేదు కూతురుకన్నా ఎక్కువ కాదనుకున్నాడు. వెనక్కివచ్చిన బిడ్డకు అండగావుండి తన జీవితాన్ని మళ్లీ గాడిలో పెట్టాడు. ఈరోజు కూతురు మనవరాళ్లతో సంతోషంగా వున్నాడు ఆయన. తండ్రిప్రేమ గురించి చెప్పాలంటే ఇవి కదా చెప్పాలి. ఆయనకంటే చించుకునేంతగా ఏముందిరా మీకు.
పెద్దగా చదువులేదు, ఆస్తిపాస్తులు లేవు, చిన్నప్పుడే కూతురు మిస్ అయ్యింది. ఏళ్ళు గడిచినా కూతురికోసం వెతుకులాట ఆపలేదు. చివరికి ఆమె women trafficking బారినపడి ఓగుడి దగ్గర బ్రోతల్ హౌస్ లో బలవంతంగా ఉంచబడిందని తెలిసినప్పుడు, గుండెపగిలేలా ఏడుస్తూ వచ్చి కూతుర్ని గుండెలకు హత్తుకుని సంతోషంగా ఇంటికి తీసుకుపోయాడు. అలానే 15పైన కుటుంబాలు అక్కడ ఆడపిల్లలు ఉన్నారని అనగానే తమ బిడ్డవుందేమో అని కళ్లనీళ్లతో పరుగెత్తుకువచ్చారు. దీన్ని కదరా కన్నప్రేమ అనేది.
అక్రమంగా ఆస్తులు సంపాదించి, తనమాట కాదని వెళ్లడమే కాకుండా, సంతోషంగా తనముందే తిరుగుతుంటే అహం దెబ్బతిని తీవ్రవాదులతో డీల్ కుదుర్చుకుని, ఆమె భర్తను చంపి కుతి తీర్చుకుంటే దాంట్లో తండ్రి ప్రేమ వుందంటారేంట్రా నాయనా.
తల్లిదండ్రులకోసం ప్రేమని వదిలేసుకున్న పిల్లలు, పిల్లల ప్రేమకోసం మనసు చంపుకున్న తల్లిదండ్రులు కోకొల్లలుగా వున్నారు. అవీ కన్నప్రేమలంటే. నీఇష్టం లేకుండా, నీ ఇష్టాఇష్టాలను పరిగణలోకి తీసుకోకుండా మీజీవితం మీద ఏ నిర్ణయాన్ని తీసుకోము అని పిల్లలతో చెప్పిచూడండి. అసలు వాళ్ళు ప్రేమ కోసం ఇల్లువదలాల్సిన పరిస్థితే ఉండదు.
కన్న ప్రేమకు ఉదాహరణగా మీచుట్టూ వందలమంది ఉండొచ్చు. చదువులు ఆపేసిమరీ 18ఏళ్ల లోపే బాల్యవివాహాలు చేస్తుంటే నోరులేవదు గానీ, 18ఏళ్ల అమ్మాయి తనకు నచ్చిన వాడ్ని చేసుకుంటే మాత్రం దేశభవిష్యత్ దెబ్బతింటున్నట్టు ఏడ్చే సంస్కార పరిరక్షకులు మాత్రం ఫుల్లుగా వున్నారు. మంచి Job, ఆస్తి ఉందని నచ్చని వ్యక్తితో బలవంతంగా పెళ్లిచేసి జీవితాంతం ఆమెను నరకంలోకి నెట్టడం, ఇగో కోసం, వాడేవడో ఏదో అనుకుంటాడాని కన్నబిడ్డల జీవితాన్ని చిదిమేసి, దాన్ని కూడా ప్రేమనుకునే దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉండటం దౌర్భాగ్యం.
loading...
No comments:
Post a Comment