loading...
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో నిర్వహిస్తున్న మహాచండీయాగానికి సందర్శకుల కోసం అదనపు సౌకర్యాలు కల్పించడం జరిగింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చే వారి కోసం రూట్ మ్యాప్‌ను తయారు చేసి పలు రహదారులపై ఏర్పాట్లు చేపట్టారు.
వరంగల్, నల్గొండ తదితర ప్రాంతాల నుంచి భువనగిరి, జగదేవ్‌పూర్ మీదుగా వచ్చే వారు కూడా గణేష్‌పల్లి కమాన్ ద్వారా నర్సన్నపేట, ఎర్రవల్లి మీదుగా యాగక్షేత్రానికి చేరుకోవచ్చు. మరోదారి జగదేవ్‌పూర్ నుంచి లింగారెడ్డిపల్లి, ఇటిక్యాల మీదుగా ఎర్రవల్లి, ఫాంహౌస్ మీదుగా యాగక్షేత్రానికి చేరుకోవచ్చు.
అదేవిధంగా కరీంనగర్, నిజామాబాద్, సంగారెడ్డి, ఆదిలాబాద్ తదితర ప్రాంతాల నుంచి తరలివచ్చేవారు ప్రజ్ఞాపూర్ మీదుగా గణేష్‌పల్లి, నర్సన్నపేట మీదుగా ఎర్రవల్లికి చేరుకోవచ్చు. రాజీవ్ రహదారి ప్రజ్ఞాపూర్ నుంచి గణేష్‌పల్లి చౌరస్తా దాటిన తర్వాత ఉన్న కమాన్ వరకు 7కిలోమీటర్లు, అక్కడి నుంచి నర్సన్నపేట, ఎర్రవల్లి యాగక్షేత్రం వరకు 4కిలోమీటర్లు మొత్తం 11కిలోమీటర్లు ఉంటుంది.
హైదరాబాద్ నుంచి అయుత చండీయాగానికి తరలివచ్చేవారు రాజీవ్ రహదారి మీదుగా వర్గల్ మండలం గౌరారం స్టేజీ వద్ద ఏర్పాటు చేసిన అయుత చండీయాగ కమాన్ నుంచి పాములపర్తి, మర్కూక్, యూసూఫ్‌ఖాన్ పేట మీదుగా ఎర్రవల్లి ఫాంహౌస్ యాగక్షేత్రానికి చేరుకోవచ్చు. రాజీవ్ రహదారిపై గౌరారం స్టేజీ వద్ద నుంచి యాగక్షేత్రం వరకు 11కిలోమీటర్ల దూరం ఉంటుంది.
loading...
No comments:
Post a Comment