loading...
హైదరాబాద్: టిడిపి సీనియర్ నేత బాలకృష్ణ ఫోన్ చేస్తేనే తెలంగాణ టిడిపి ఎమ్మెల్యే ఫోన్ లిఫ్ట్ లేదు అంట. దీంతో బాలకృష్ణ ఆ ఎమెల్యే పై సీరియస్ అయినట్లు సమాచారం..వివరాల్లోకి వెళ్తే గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ సీట్ల కోసం స్థానిక ఎమ్మెల్యేలపై ఎవరిస్థాయిలో వారు పై నుంచి ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నాలు చేయడం.ఇందులో భాగంగా హైదర్ నగర్ టిక్కెట్ ఆశిస్తున్న భాను ప్రకాష్ అనే మాజీ కార్పోరేటర్, బాలయ్య ఫ్యాన్ తన టిక్కెట్ కోసం ఫోన్ చేయించుకునేందుకు ప్రయత్నించారట. కాని భాను ని మరో ఎమెల్యే బాలకృష్ణ వద్దకు తీసుకువెళ్లినట్లు సమాచారం. ఈ విషయం అంతా విన్న బాలకృష్ణ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీకి ఫోన్ చేశారని తెలుస్తోంది.రెండుసార్లు ఫోన్ చేసినా గాంధీ లిఫ్ట్ చేయ లేదు అంట.
దీంతో తన పక్కనే ఉన్న మరో నగర ఎమ్మెల్యే ని తన ఫోన్ నుంచి కాల్ చేయాలని బాలయ్య సూచించారట.వెంటనే గాంధీ ఆ కాల్ ని లిఫ్ట్ చేశారట. దీంతో గాందీకి ఏమి చెప్పాలో తెలియక కాస్త ఇబ్బంది పడ్డారు అంట.బాలకృష్ణ కూడా తనదైన శైలిలో భానుప్రకాష్ కు మాత్రమే ఆ డివిజిన్ టిక్కెట్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారట..అయితే గత స్థానిక ఎమెల్యే ఎన్నికల్లో గాంధీకి భాను పూర్తిస్థాయిలో సహకారం అందించకపోవడం, స్థానికంగా కొందరు టిడిపినేతలతో భానుకి పడకపోవడంతోనే గాంధీ ఆ టిక్కెట్ ను ఇవ్వొద్దని భావించినట్లు తెలుస్తోంది.
loading...
No comments:
Post a Comment