Latest News

  

శబరిమలలో మహిళలకు ప్రవేశమా? అయ్యప్ప స్వామికి కోపం వచ్చిందా...?

loading...

కేరళలో జల ప్రళయానికి కారణం అయ్యప్ప స్వామినేనని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. వందేళ్లలో కనీవినీ ఎరుగని రీతిలో కేరళను వరదలు అల్లకల్లోలం చేశాయి. ఇందుకు అయ్యప్ప స్వామి శాపమే కారణమని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. హరిహరుల సుపుత్రుడి కోపంతోనే కేరళ జలదిగ్భంధంలో వుందని వారు చెప్తున్నారు.

శబరిమల కొండల్లో కొలువైన అయ్యప్పస్వామి కోరి వచ్చిన వారికి కొంగు బంగారం. క్షీరసాగర మధనం తర్వాత మోహినీ అవతారంలో వచ్చిన విష్ణువును శివుడు మోహించడం ద్వారా అయ్యప్ప అవతరించాడని పురాణాలు చెప్తున్నాయి. మహిషాసురుడిని వధించేందుకు అవతరించిన అయ్యప్ప స్వామి జ్యోతిస్వరూపంలో భక్తులకు అభయమిస్తాడు.

అయ్యప్ప స్వామిని దర్శించుకోవడం కోసం 41 రోజుల పాటూ కఠినమైన నియమాలతో దీక్షలు చేసిన భక్తులు 18 మెట్లు ఎక్కుతారు.

స్వామిని దర్శించుకుంటారు. అయితే స్వామివారి దర్శనానికి ఆడవారికి ఆంక్షలున్నాయి. పదేళ్ల నుంచి 50 యేళ్ల మహిళలకు ఆలయ ప్రవేశం నిషేధమన్న సంగతి తెలిసిందే.

దీనిపై గత కొంతకాలంగా తీవ్ర విమర్శలు రావడం ఇదే అంశంపై సుప్రీంకోర్టులో పిటీషన్ వేయడం మహిళలకు కూడా ప్రవేశం కల్పించాలని సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కానీ ప్రస్తుతం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే కేరళను ముంచేసిందని.. ఆ తీర్పుతోనే అయ్యప్పకు కోపం వచ్చిందని భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అందుకే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వరదలతో రాష్ట్రం అల్లకల్లోలం అవతుందనే వాదనలు భారీగా వినిపిస్తున్నాయి. ఇక సోషల్ మీడియా అయితే ఇదే విషయాన్ని కోడై కూస్తోంది. వాట్సాప్, ఫేస్బుక్లో దీనిపై చర్చ సాగుతోంది.

అయ్యప్ప స్వామి భక్తులు మాత్రం.. వరదలు కచ్చితంగా సుప్రీం తీర్పు వల్లే వచ్చాయని వాదిస్తున్నారు. మరికొందరైతే ప్రకృతికి ప్రకోపమే ఈ విలయానికి కారణమని అంటున్నారు. చాలామటుకు నెటిజన్లు సుప్రీం కోర్టు తీర్పును ట్యాగ్ చేస్తూ వాదనలు ముందుంచుతున్నారు.
loading...

No comments:

Post a Comment

Teenmar News | Online English, Telugu,Telangana News Portal Designed by Templateism Copyright © 2014

Powered by Blogger.