Latest News

  

ఒక గర్భవతైన భార్య, ఆమె భర్త ఇలా మాట్లాడుకుంటున్నారు..!!

loading...
భార్య: ఏం అనుకుంటున్నావ్..? అబ్బాయి పుడతాడనా ? అమ్మాయనా..??

భర్త: అబ్బాయనుకో... వాడికి లెక్కలు నేర్పుతాను... ఇద్దరం కలిసి గేమ్స్ ఆడుకుంటాం... స్విమ్మింగ్
నేర్పుతా... చెట్లెక్కడం నేర్పుతా... అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో నేర్పుతా... ఇంకా....

భార్య: చాలు చాలు! మరి అమ్మాయి పుడితే..!?

భర్త: అమ్మాయైతే ఏం నేర్పనవసరంలేదు...!  అదే నాకు నేర్పుతుంది... నేనేం తినాలి... ఏం తినకూడదు...
ఏం మాట్లాడాలి... ఏం మాట్లాడకూడదు... నేను ఎలాంటి బట్టలు వేసుకోవాలి... ఒక రకంగా మా అమ్మ లాగా
అన్నమాట.. ఇంకా నేను దానికి ప్రత్యేకంగా ఏం  చేయకపోయినా నన్ను హీరోలా  చూసుకుంటుంది.  నన్నెవరైనా బాధపెట్టారనుకో, వాళ్ళని అస్సలు క్షమించదు... ఎదురు తిరుగుంది... భర్త దగ్గర కూడా నాగురించి గొప్పగా చెప్తుంది... మా నాన్న నాకోసం అది చేసాడు... ఇది చేసాడు అనీ...

భార్య: సో..అమ్మాయైతే ఇవన్నీ చేస్తుంది... అబ్బాయైతే చేయడంటారు అంతేగా..??

భర్త: కాదు.. అబ్బాయైతే ఇవన్నీ మనల్ని చూసి నేర్చుకుని చేస్తాడు... అమ్మాయికి బై బర్త్ వచ్చేస్తాయ్...

భార్య: అదేం శాశ్వతంగా మనతోనే ఉండిపోదు కదా..!

భర్త:  ఉండదు...కానీ మనం దాని గుండెల్లో ఉండిపోతాం... అందుకని అది ఎక్కడ ఉంది అన్నది సమస్య కాదు..!
Daughters are Angles. Born with unconditional love and care forever

అందుకని ఆడపిల్లల తల్లిదండ్రులు అదృష్టవంతులు...
కూతురంటే కూడికల, తీసివెతల లెక్క కాదు నీ వాకిట్లో పెరిగే 'తులసి  మొక్క'... కూతురంటే దించేసుకొవలసిన  బరువు కాదు.. నీ ఇంట్లో వెలసిన 'కల్పతరువు'...
కూతురంటే భద్రంగా చూడవలసిన గాజు బొమ్మ కాదు... నీ కడుపున పుట్టిన  మరో "అమ్మ"...
కూతురంటే కష్టాలకు,కన్నీళ్ళకు వీలునామా కాదు ... కల్మషం లేని 'ప్రేమ' కు చిరునామా... కళ్యాణమవగానే
నిన్ను విడిచివెళ్ళినా... పరిగెత్తుకొస్తుంది నీకు ఏ కష్టమెచ్చినా... తన ఇంటి పేరు మార్చుకున్న కడదాక వదులుకోదు పుట్టింటి పైన ప్రేమను...  కొడుకులా కాటి వరకు తోడురాకపోయినా... అమ్మ అయి నీకు ప్రసాదించగలదు మరో జన్మ... కూతురున్న ఏ ఇల్లు అయినా అవుతుంది..

దేవతలు కొలువున్న కోవెల... కూతురిని కన్న ఏ తండ్రి అయినా గర్వపడాలి యువరాణి ని కన్న మహారాజు లా..
loading...

No comments:

Post a Comment

Teenmar News | Online English, Telugu,Telangana News Portal Designed by Templateism Copyright © 2014

Powered by Blogger.