Latest News

  

కన్నీళ్లు తెప్పిస్తున్న ఓ సైనికుడి లేఖ..!!

loading...

మనిద్దరమూ 18 వ ఏటే ఇంట్లోంచి బయటకు వచ్చాం.. నువ్వు నీ JEE క్లియర్ చేశావ్..నేను NDA కు సెలక్ట్ అయ్యాను..నువ్వు ఐఐటి లో చేరావ్..నేను అకాడమీ లో చేరాను..నువు డిగ్రీకోసం రేయింబవళ్ళూ కష్టించావ్… నేను ప్రపంచంలోనే అత్యంత కఠిన పరిస్తితుల మద్య ట్రైన్ అయ్యాను..నువ్వు బి.టెక్ పూర్తి చేశావ్..నేను కమీషండ్ ఆఫీసర్ అయ్యాను..నీకు రోజూ ఉదయం 7 తో మొదలయ్యి సాయంత్రం 6 తో ముగుస్తుంది..నాకు ఉదయం 4 తో మొదలయ్యి రాత్రుళ్ళు కూడా శిక్షణ పొందాల్సి ఉంటుంది.

నీకు కాలేజీ లో స్నాతకోత్సవం ఉంటుంది..నాకు పాసింగ్ ఔట్ పెరేడ్ ఉంటుంది. నువ్వు బెస్ట్ కంపెనీలో బెస్ట్ ప్యాకేజీతో చేరతావ్..నేను నా ప్లటూన్ లో భుజాన రెండు నక్షత్రాలతో చేరతాను.. నీకు ఉద్యోగం వచ్చింది….నాకు జీవన పరమార్ధం దొరికింది.. ప్రతి సందర్భంలోనూ నువ్వు నీ నీకుటుంబాన్ని కలుస్తావు.. నేను నా తల్లితండ్రులను చూసే సమయం కోసం ఎదురుచూస్తాను..నువ్వు పండగలన్నీ ఆనందోత్సాహలతో జరుపుకుంటావ్..నేను నా సహచరులతో బంకర్లలో జరుపుకుంటాను.. మనిద్దరికీ పెళ్లయింది.. నీ భార్య నిన్ను రోజూ చూస్తుంది..నా భార్య నన్ను ఈరోజు ప్రాణాలతో చూస్తే చాలనుకుంటుంది..నువ్వు బిజినెస్ ట్రిప్ కోసం విదేశాలు వెళ్తావ్.. నేను దేశ రక్షణ కోసం సరిహద్దుకు వెళ్తాను.. మనిద్దరమూ తిరిగొస్తాము.చాలా రోజుల తర్వాత చూసిన నీ భార్య కన్నీళ్ళు నువ్వు తుడుస్తావు. నేను తుడవలేనుతనకు ఆత్మీయ కౌగిలి ఇస్తావ్.. నేను ఇవ్వలేను ఎందుకంటే నేను శవపేటికలో ఉన్నాను నా చాతీ మీద మెడల్స్ ఉన్నాయ్.. వాటి బరువుకు నేను లేవలేను.


నా మహాప్రస్థానానికి అమర్చిన శవపేటిక గుర్రపు బగ్గీ మీద నా జీవన సాఫల్యమైన భారత త్రివర్ణ పతాకంతో అందంగా చుట్టబడి ఉంది ఆ గర్వించే క్షణాలు వదులుకొని నేను శవపేటిక లోనుంచీ బయటకు రాలేను మాతృభూమి రక్షణలో నా జీవితం సార్ధకమైంది మళ్ళీ సైనికుడిగా నే పుడతాను నా జీవితం ఇంతటితో సమాప్తం ఎందుకంటే నేను సైనికుణ్ణి అమరుడ్ని నీ జీవితం ముందుకే వెళ్ళాలని ఆశిస్తూ నీ మితృడైన ఒక సైనికుడు భారత్ మాతాకి జై జై హింద్. భారతీయుడు మనసుకు హత్తుకునే లేఖ ఇది షేర్ చేస్తారో కాపీ పేస్టు చేసుకుంటారో మీ ఇష్టం దయచేసి అందరి వద్దకు చేర్చండి..
loading...

No comments:

Post a Comment

Teenmar News | Online English, Telugu,Telangana News Portal Designed by Templateism Copyright © 2014

Powered by Blogger.