Latest News

  

కన్నీళ్ళు పెట్టిస్తున్న My Village Show గంగవ్వ జీవిత కథ

loading...
గంగవ్వ..
ఊహ తెలియని వయసులో తన తండ్రిని కోల్పోయి, ఐదేళ్ల వయసులోనే తల్లిని కూడా కోల్పోయి తన ఇద్దరు తమ్ముళ్లతో తినటానికి తిండి లేక, సాదే దిక్కు లేక మిగిలిపోయింది. ఎంతైనా ఒక ఆడదాని కష్టం ఇంకో ఆడదానికే అర్థం అవుద్దేమో, కన్న తల్లిలానే ఓ తల్లి గంగవ్వను పోషించింది. తర్వాత కొద్దిరోజులకే ఒక ఇంటిదాన్ని చేశారు. ఆ ఐదేళ్ల వయసుకు పెళ్లి అనే బాధ్యతని అప్పచెప్పారు. అమ్మ చేతిముద్దలు, చందమామ కథలు వింటూ పెరగాల్సిన తను అత్తారింట్లో పెరిగింది. అలా ఒక వయసుకి వచ్చిన తరువాత తన అత్తతో కలిసి 2 రూపాయిల కోసం 1000 బీడీలు చుడుతూ, పొలాలు పండించుకుంటూ ,ఇంకెన్నో పనులు చేస్తూ జీవనం సాగించేది. అప్పటికే ముగ్గురు పిల్లల తల్లి. కానీ ఆ తల్లికి తోడుగా నీడగా ఉండాల్సిన మొగుడు మాత్రం తాగుడికి బానిస అయ్యాడు. రూపాయి రూపాయి కోసం ఎన్నో కష్టాలు పడి ఇంటికొచ్చి ఇంట్లో మొగుడి దెబ్బలతో ఒళ్ళు హూనం చేయించుకోవడం. ఇలాంటి కష్టమైన పరిస్థితుల్లో అతను మాత్రం నేను dubai పోత అనగానే కన్న తల్లి, కట్టుకున్న భార్య కాదనలేక అరవైవేల రూపాయిలు అప్పు తెచ్చి ఇచ్చారు.
అలా వెళ్లిన పదేళ్ల వరకు రూపాయి కూడా పంపలేదు.
కానీ గంగవ్వ మాత్రం తన పిల్లల కోసం అలాగే కష్టపడుతూ రూపాయి రూపాయి పోగుచేసుకుంటు పిల్లలని పెద్ద చేసి, తండ్రి లేకుండానే పెద్ద కూతురికి పెళ్లి చేసింది.
ఇంకొన్నాలకి దసరా పండగ వచ్చింది. తన భర్త అప్పుడైనా వస్తాడేమో అని ఎదురు చూస్తున్న గంగవ్వకి పండగ రోజు తన అత్త చావు శోకాన్నీ మిగిల్చింది. కొడుకు బాధ్యతని కోడలు తీసుకొని ఆ తల్లిని కాటికి పంపింది.
అలా అయిన కొన్నాళ్ళకి సంక్రాంతి పండగ రోజు ఇంకా నాకు నా మొగుడు లేడు, చచ్చాడు అనుకోని బొట్టు తుడిపేస్కుంటున్న సమయంలో గడ్డం ఏసుకొని గుడుంబా తాగుతూ వచ్చాడు. రావడంతోనే ఇలా చేస్తావా నేను బ్రతికి ఉండగానే అని నోటికొచ్చిన బూతులు తిడుతూ కొట్టసాగాడు. ఎన్నేళ్లయిన ఆ కష్టాలు మారలేదు ఆ మొగుడు మారలేదు.
అలా కొన్నాళ్ళకి అతను తాగి తాగి కన్నుమూసాడు.
ఇంక పిల్లలని పట్టుకొని కష్టాన్ని కొనసాగిస్తుంటే, శ్రీకాంత్ వాళ్ళ ఊరిని, చెట్లని,పుట్లని ,కప్పలని తీస్తూ ఒకరోజు గంగవ్వ నీకేమైన మాటలొస్తాయా? అని శ్రీకాంత్ అడిగితే నాకు,అమ్మ నాన్న లేరూ ఏడుపొస్తది, మాటలొచ్చు, పాటలొస్తాయి, ముచ్చట వస్తది, అన్ని వస్తాయి అని మొదలైన వాళ్ల ముచ్చట మనం ఇప్పుడు youtube sensation గా చూస్తున్న గంగవ్వ జీవితం.
loading...

No comments:

Post a Comment

Teenmar News | Online English, Telugu,Telangana News Portal Designed by Templateism Copyright © 2014

Powered by Blogger.