loading...
ట్రక్కులు, బస్సులు, ఆటోల వెనకాల ‘హార్న్ ఓకే ప్లీజ్’ రాసి ఉండటం చూసే ఉంటాం. ఓవర్‌టేక్ చేయాలనుకునేవారు హారన్ మోగించాలనేది దాని ఉద్దేశం. కానీ హార్న్ ప్లీజ్ మధ్యలో ఓకే ఎందుకు వచ్చి చేరిందంటే ఆసక్తికర కథనాలే ప్రచారంలో ఉన్నాయి. అవేంటంటే...
- డెబ్భై ఏళ్లకు ముందు నుంచే టాటా ట్రక్కులు తయారు చేస్తోంది. మొదట్లో అది ‘టాటా ఆయిల్‌మిల్స్’కి అనుబంధంగా ఉండేది. ఈ కంపెనీ తర్వాత ‘ఓకే’ పేరుతో ఒక డిటర్జెంట్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ప్రచారంలో భాగంగా ప్రతి టాటా ట్రక్కు వెనకాల హార్న్ ప్లీజ్ మధ్యలో ఓకే పదం చేర్చడం మొదలెట్టారు. కొన్నేళ్లకు ఆ డిటర్జెంట్ కనుమరుగైనా ఓకే రాయడం మాత్రం మరవలేదు.
- రెండో ప్రపంచయుద్ధ కాలంలో డీజిల్ కొరత ఎక్కువగా ఉండటంతో ట్రక్కులన్నింటినీ పెట్రోల్‌తో నడిపించేవారు. అయితే వీటికి త్వరగా మండే స్వభావం ఉండటంతో ప్రమాదాలను నివారించే ఉద్దేశంతో వెనకవచ్చే వాహనాలు జాగ్రత్తపడాలని పెట్రోల్ ట్యాంకు, వెనకభాగంలో ‘హార్న్ ప్లీజ్’, ‘ఓకే’ అని రాయడం ప్రారంభించారు. అదలాగే కొనసాగుతోంది.
- ముందు వెళ్తున్న లారీని ఓవర్‌టేక్ చేయాలనుకుంటే హారన్ మోగించడం సహజమే. వాళ్లు ముందుకెళ్లడానికి లారీడ్రైవరు పక్కకు తప్పుకోవడమో, కాస్త ఆగమని చేతులతో సైగలు చేయడమో చేస్తాడు. రాత్రిపూట అయితే ఇలా చేయడం ఇబ్బందిగా ఉంటుందని వెనకాల ఓకే అనే అక్షరాలు రాసి దాని కింద చిన్న లైటు అమర్చేవారు. అది వెలిగిందంటే ముందుకెళ్లమని అర్థం.
- మరో వాదన ప్రకారం మొదట్లో హార్న్ ఓటీకే అని రాసేవారు. ఓటీకే అంటే ఓవర్‌టేక్ అని. అంటే ఓవర్‌టేక్ చేయాలి అనుకునేవారు హారన్ మోగించండి అని. రాన్రాను టీ అనే అక్షరం కనుమరుగైపోయి ఓకే మిగిలిపోయిందని చెబుతారు.
loading...
No comments:
Post a Comment