loading...
మంత్రజపాలు చేసినా, హోమాలు నిర్వహించినా, యజ్ఞయాగాదులు చేసినా, గొప్ప గొప్ప శాస్త్రాలు చదివినా బుద్ధి కుదురుగా లేకపోతే, ప్రవర్తన సరిగా లేకపోతే మోక్షం కలుగదు'' అని తనను దర్శించడానికి వచ్చే భక్తులకు తరచు బోధించేవారు సాయి.
సాయి చెప్పిన దానిని బట్టి ప్రార్థన అంటే దేవుడితో బేరం కుదుర్చుకోవడం కాదు. 'ఫలానా పని అయితే నీ దగ్గరకు వస్తాను, అదిస్తాను, ఇదిస్తాను, నాకు ఈ పని అయ్యేలా చూడు' అని మొక్కుకోవడం కాదు. నిజమైన ప్రార్థనలో ప్రతిఫలాపేక్ష ఉండదు. మనకు జీవితమనే గొప్ప అవకాశం ఇచ్చిన దేవుడికి కృతజ్ఞత చెప్పుకోవడం ప్రార్థనలోని పరమార్థం. ఇంకా సూటిగా చెప్పాలంటే - 'ప్రార్థన అంటే మనం దేవుడితో మాట్లాడే సమయం'అన్నమాట.
నిజంగా దేవుడి కోసం చేసే ప్రార్థనలో కోరికలు ఉండకూడదు. ఇచ్చిపుచ్చుకోవడాలు ఉండకూడదు. నిజమైన భక్తి ఎలా ఉండాలంటే.. మనసులో మంచిని తలుచుకోవాలి.
కళ్లతో మంచిని చూడాలి. నాలుకతో మంచిని మాట్లాడాలి. చెవులతో మంచిని వినాలి. మనసును నిర్మలంగా ఉంచుకోవాలి.
ఎందుకంటే నిర్మలం కాని మనసులోకి భగవంతుడు ప్రవేశించలేడు.
loading...
No comments:
Post a Comment