Latest News

స్నేహానికి అర్థం తెలిపిన శ్రీనివాసా రామానుజన్

loading...


*220,284 సంఖ్య‌ల‌తో…*

స్నేహానికి సంపూర్ణ అర్థం చెప్పిన.. శ్రీనివాస రామానుజ‌న్.! అదెలాగో తెలుసా?

భార‌త‌దేశ సుప్ర‌సిద్ద గ‌ణిత శాస్త్ర‌జ్ఞుడు శ్రీనివాస రామానుజ‌న్ కు క్లోజ్ ఫ్రెండ్స్ చాలా త‌క్కువ మంది ఉండేవారు…ఇదే విష‌యాన్ని ఓ మిత్రుడు రామ‌నుజ‌న్ వద్ద ప్ర‌స్తావించాడు.! మీకెందుకు క్లోజ్ ఫ్రెండ్స్ ఎక్కువ‌గా ఉండ‌ర‌ని?

దానికి శ్రీనివాస రామానుజ‌న్ చెప్పిన స‌మాధానం... నిజంగా అ శ్రీనివాస రామానుజ‌న్ గొప్ప గణిత మేధావి అని చెప్పక తప్పదు.

నేను రెండు సంఖ్య‌ల‌ను చెబుతాను…ఆ సంఖ్య‌ల మాదిరిగా ఎవ‌రైనా ఉండ‌గ‌లిగితే వారితో క్లోజ్ ఫ్రెండ్ షిప్ చేయొచ్చు..!
అవి 1) 220 2) 284…

Friend: ఈ రెండు సంఖ్య‌ల‌కు స్నేహానికి లింక్ ఏమిటి?

రామానుజ‌న్: అదే క్లియ‌ర్ గా చెబుతా వినండి….. 220 సంఖ్య‌కు కార‌ణాంకాలు( 220 ను నిశ్శేషంగా భాగించే సంఖ్య‌లు) చెప్పండి.

Friend: 1,2,4,5,10,11,20,22,44,55,110,220.

రామానుజ‌న్:అలాగే 284 కు కార‌ణాంకాలు చెప్పండి.

Friend:1,2,4,71,142,284.

రామానుజ‌న్: ఇప్పుడు మొద‌టి సంఖ్య(220) కార‌ణాంకాల నుండి…. మొద‌టి సంఖ్య (220)ను తీసేసి, మిగితా వాటిని కూడండి…?

Friend: 1+2+4+5+10+11+20+22+44+55+110 = 284.

రామానుజ‌న్: ఇప్పుడు రెండ‌వ‌ సంఖ్య(284) కార‌ణాంకాల నుండి…. రెండ‌వ‌ సంఖ్య (284)ను తీసేసి, మిగితా వాటిని కూడండి…?

Friend: 1+2+4+71+142= 220.

చేసేశాను…అయితే …ఇప్పుడేమైంది?

రామానుజ‌న్: 220 కార‌ణాంకాల‌ను రాసి…220 ను తీసేసి మిగిలిన వాటిని కూడితే…రెండ‌వ సంఖ్య 284 వ‌చ్చింది, అలాగే…. 284 కు కార‌ణాంకాలు రాసి…284 ను తీసేసి మిగిలిన వాటిని కలిపితే మొద‌టి సంఖ్య 220 వ‌చ్చింది.

అంటే…. స్నేహం కూడా ఇలాగే ఉండాలి…ఒక‌టి లేకుపోయినా..ఇంకోక‌టి దానిని భ‌ర్తీ చేసేదిగా ఉండాలి…అలా ఉన్న‌ప్పుడే స్నేహానికి విలువ‌.!

Friend:యు ఆర్ గ్రేట్ రామానుజ‌న్.
loading...

No comments:

Post a Comment

Teenmar News | Online English, Telugu,Telangana News Portal Designed by Templateism.com Copyright © 2014

Powered by Blogger.