Latest News

వరాలిచ్చే వరలక్ష్మి వ్రత విధానం

loading...


శ్రావణమాసం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు మహిళలందరూ వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తారు. వరాలు యిచ్చే దేవతగా వరలక్ష్మీ దేవిని కొలుస్తారు. ఈ రోజున వరలక్ష్మిని పూజిస్తే సంవత్సరమంతా లక్ష్మీదేవిని పూజించిన ఫలితం లభిస్తుంది. వరలక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయని విశ్వసిస్తారు.

ఈ శుక్రవారం వరలక్ష్మీవ్రతం సందర్భంగా...

లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీ రంగథామేశ్వరీం
దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవః బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం
త్రిలోక్య కుటుంబినీం సరసిజాం వందేముకుంద ప్రియాం
స్కంద పురాణంలో పరమేశ్వరుడు వరలక్ష్మీ వ్రతం గురించి పార్వతీదేవికి వివరించాడు.

స్త్రీలు సకల ఐశ్వర్యాలనూ, పుత్రపౌత్రాదులనూ పొందేందుకు వీలుగా ఏదైనా ఓ వ్రతాన్ని సూచించమని పార్వతీదేవి ఆదిదేవుణ్ణి కోరింది. అప్పుడు శంకరుడు ఆమెకు వరలక్ష్మీ అనుగ్రహం పొందిన చారుమతీదేవి వృత్తాంతాన్ని తెలియజేశాడు. భర్త పట్ల ఆదరాన్నీ, అత్తమామల పట్ల గౌరవాన్నీ ప్రకటిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతల్ని నిర్వహిస్తూ ఉండేది.

మహాలక్షీదేవి పట్ల ఎంతో భక్తిశ్రద్ధలు కలిగిన చారుమతి, అమ్మవార్ని త్రికరణ శుద్ధిగా పూజిస్తుండేది. ఆ మహా పతివ్రత పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి, స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరించింది. శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారాన తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ ఇస్తానని అభయమిస్తుంది. అమ్మ ఆదేశానుసారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించి చారుమతి సమస్త సిరి సంపదల్ని అందుకుంది.

వ్రత విధానం

మొదట పసుపుతో గణపతిని పూజించి, కలశంలోకి వరలక్ష్మీ దేవిని ఆవాహన చేయాలి. ఆమెకు షోడశోపచార, అథాంగ పూజలు నిర్వహించాలి.

తరువాత అష్టోత్తరశతనామాలను చదివి ధూప, దీప, నైవేద్య, తాంబూలాలు సమర్పించాలి. కర్పూర నీరాజనం, మంత్రపుష్పం సమర్పించాలి. మంగళహారతి ఇచ్చి తోరగ్రంథి పూజ చేయాలి.

తోరబంధన మంత్రం పఠిస్తూ ఆ నవసూత్రాన్ని కుడిచేతికి కట్టుకోవాలి. నవకాయ పిండివంటలూ, పండ్లూ మొదలైన వాటిని అమ్మవారికి సమర్పించాలి. చివరగా వాయనదాన మంత్రం పఠిస్తూ ఒక ముత్తైదువకు తాంబూలం సమర్పించాలి. ఆమెను మహాలక్ష్మిగా భావించి
వాయనమీయాలి.
loading...

No comments:

Post a Comment

Teenmar News | Online English, Telugu,Telangana News Portal Designed by Templateism.com Copyright © 2014

Powered by Blogger.