loading...
ఈ భాషలు కొలువుల బాటలు
టాప్ 5 కంప్యూటర్ లాంగ్వేజీలు
కంప్యూటర్ రంగంలో రోజుకో ప్రోగ్రామింగ్ భాష పుట్టుకొస్తోంది. వాటి మనుగడ ఎన్నాళ్లో ఎవరూ చెప్పలేకపోతున్నారు. వందల లాంగ్వేజీలు వస్తున్నాయి. వేటిని నేర్చుకుంటే ఎక్కువ ఉపయోగం, భవిష్యత్తుకు భద్రతను ఇచ్చేవి ఏవి... ఇలాంటి సందేహాలతో సతమతమవుతున్న విద్యార్థులకు టాప్ 5 భాషలు, వాటి ప్రయోజనాలను అందిస్తున్నాం. ఇవి ఈ సంవత్సరం అత్యంత వినియోగంలో ఉన్న లాంగ్వేజీలు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లర్నింగ్ వంటి అధునాతన అప్లికేషన్లలోనూ ప్రయోగించేవి. వీటిపై పట్టు సాధిస్తే ఆఫర్ లెటర్లు తేలిగ్గా అందుతాయి.
సాఫ్ట్‌వేర్ ప్రోగ్రాములకు సంబంధించి చాలావరకు మనం వినేవి సి, సి++, జావా లాంగ్వేజీలు. అలాగే డేటాబేస్‌కి సంబంధించినంతవరకూ ఒరాకిల్ తప్ప వేరేవీ పెద్దగా తెలియవు. ఐతే వందలాది ప్రోగ్రామింగ్ లాంగ్వేజీలు ఉండటమే కాదు, వీటిలో కొన్ని నిర్దిష్ట పరిస్థితులకు అతికినట్లు సరిపోతాయి. ఏటా ఏ లాంగ్వేజీకి ఆదరణ పెరిగిందనే అంశంపై విశ్లేషణలూ జరుగుతుంటాయి. 2018 సంవత్సరంలో అత్యధికంగా వినియోగంలో ఉన్నవీ, కొత్త రంగాల్లో ప్రయోగించగలిగినవీ ఐదు ప్రధానమైన లాంగ్వేజీలున్నాయి. ఒక్కోదాని గురించి వివరంగా చూద్దాం!
పైతాన్
గత ఐదేళ్లలో ఎంతో ప్రజాదరణ పొందిన లాంగ్వేజీ ఇది. 2017లో మూడో స్థానంలో ఉండి, ఈ సంవత్సరం మొదటి స్థానాన్ని ఆక్రమించుకుంది. ప్రోగ్రాములో ఇచ్చే సూచనలు అతి సరళంగా, ఇంచుమించు మనం మాట్లాడుకునే సాధారణ స్థాయిని పోలి ఉంటాయి. పైగా స్వయంసమృద్ధితో కూడుకున్న లైబ్రరీ (ఒక నిర్దిష్ట లక్ష్యం సాధించడానికి ముందస్తుగా రాసి నిక్షిప్తం చేసిన సూచనల సముదాయం- ఫంక్షన్లు) అధికంగా ఉన్న లాంగ్వేజీ ఇది.
ఎక్కడ ఉపయోగపడుతుంది?
* ఈ-మెయిల్, ఫైల్ ట్రాన్స్‌ఫర్ వంటి ప్యాకేజీల సులభ అభివృద్ధికి అవకాశం ఇస్తుంది.
* వైజ్ఞానిక రంగంలో పైతాన్ ప్రాబల్యం పెరుగుతోంది. గణితం, సైన్స్, ఇంజినీరింగ్ సంబంధిత లైబ్రరీలు దాదాపు పూర్తిగా అభివృద్ధి అయ్యాయి.
* ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు పైతాన్ మెలకువలను నేర్పించడానికి మొగ్గుచూపుతున్నాయి. లాంగ్వేజీకి సంబంధించిన సూక్ష్మమైన వివరాలను తెలుసుకోవాల్సిన అవసరం లేకుండా సమస్యపై ధ్యాసపెట్టి, ప్రామాణిక సమాధానాలు కనుక్కోవచ్చు.
* వ్యాపార రంగానికి సంబంధించిన ఈఆర్‌పీ, ఈ-కామర్స్‌కి సంబంధించి ప్రోగ్రామ్‌ల అభివృద్ధి సరళంగా చెయ్యడానికి వీలుంది. .
* డెస్క్‌టాప్, ఇంటర్నెట్ ఆధారిత ప్రోగ్రామ్‌ల అభివృద్ధికి అనువైన వెసులుబాట్లు ఉన్నాయి.
* సాఫ్ట్‌వేర్ డెవలపింగ్‌లో కూడా పైతాన్ క్రమంగా తన ప్రభావం చూపుతోంది.
* గ్రాఫిక్స్ డిజైనింగ్ రంగంలో దీని వినియోగం పెరుగుతోంది.
* గేమ్‌ల అభివృద్ధి కూడా సులభంగా చెయ్యవచ్చు.
ఆన్‌లైన్‌లో ఇలా నేర్చుకుందాం:
1. www.codecademy.com
2. www.tutorialspoint.com
3. www.codementor.io (For experts and advanced learning)
సి లాంగ్వేజి
ఇతర ప్యాకేజీలు తిరగరాయడానికి ‘సి’ని ప్రధానంగా అభివృద్ధి చేశారు. ఉదాహరణకు యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టాన్ని ముందు అభివృద్ధి చేసినా, పోర్టబిలిటీ కోసం ‘సి’ లో తిరగరాశారు. దాదాపు అర్ధశతాబ్ది నుంచి ఈ లాంగ్వేజీ ప్రాధాన్యం కొంతైనా తగ్గలేదంటే దీనిలోని వెసులుబాటు ఎంత గొప్పదో గ్రహించవచ్చు. సి, సి++ చేరి ఒక ప్యాకేజిగా లభ్యమవుతాయి. ప్రోగ్రామ్‌లను తక్కువ సమయంలో అమలుపరచి విలువైన కంప్యూటర్ ప్రాసెసింగ్ సమయాన్ని తగ్గించే స్థోమత ఉన్న లాంగ్వేజీ ఇది. బహుళ వినియోగమున్న ఈ జనరల్ పర్పస్ లాంగ్వేజీకి విశేష ఆదరణ ఉంది. ఉద్యోగావకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.
ఎక్కడ ఉపయోగపడుతుంది?
* ‘సి’ వినియోగం ఇంచుమించు అన్ని రంగాల్లో ఉంది. ‘సి’లో రాసిన ప్రోగ్రామ్‌లు వేగంగా ఫలితాలు ఇవ్వటం వల్ల మైక్రోసాప్ట్ విండోస్‌లోని యుటిలిటీ ప్రోగ్రామ్‌లు, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంలోని ఉపవిభాగాలు రాయడానికి ‘సి’ని వినియోగించారు.
* గణన సామర్థ్యం అవసరమున్న MATLAB, Mathematica వంటి ఇంజినీరింగ్, వైజ్ఞానిక రంగ ప్యాకేజీలు ‘సి’లోనే అభివృద్ది అయ్యాయి.
* మైక్రోవేవ్ ఓవెన్, వాషింగ్‌మెషిన్ వంటి గృహోపకరణాల నుంచి పరిశ్రమల్లో అవసరమున్న ఎంబెడెడ్ సిస్టమ్స్ ఆధారిత ప్రోగ్రాంల అభివృద్ధి దీనితో సులభమవుతుంది.
* చెస్, బౌన్సింగ్ బాల్ వంటి ఆటల్లోని ప్రోగ్రాముల అభివృద్ధి ‘సి’తో సాధ్యమయింది.
ఆన్‌లైన్‌లో ఇలా నేర్చుకుందాం:
1. www.GeeksforGeeks.org
2.https://www.cprogramming.com/
3. https://www.programiz.com/cprogramming#learn-c-tutorial
జావా
మనిషి పరిధి ఆలోచించగలిగినంతమేరకూ జావా విస్తరించగలదు. పటిష్ఠ నిర్మాణం, సరళతర ప్రోగ్రాముల అభివృద్ధికి అనుకూలమైన మాడ్యులార్ ప్రోగ్రామింగ్ వ్యవస్థ దీని ప్రత్యేకతలు. జావాలో ఉన్న లైబ్రరీ విస్తృత పరిధి కలిగినది. హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ పరిమితులకు అతీతంగా ప్రోగ్రాంల అమలు దీనితో సాధ్యమౌతుంది.
ఎక్కడ ఉపయోగపడుతుంది:
* ప్రోగ్రాములు ‘బైట్‌కోడ్’గా పరివర్తనం చెయ్యడం వల్ల ఎటువంటి వాతావరణంలోనైనా ప్రోగ్రామ్‌లు అమలుపరచగలిగిన అనుకూలతలు
* స్వతంత్రంగా మెమరీ నిర్వహణ చేసుకోగలదు.
* ఇంటర్నెట్ వంటి డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్‌లకూ, డెస్క్‌టాప్‌పై గ్రాఫిక్ ఆధారిత అప్లికేషన్‌ల అభివృద్ధికీ అనువైనది.
* మొబైల్ ఆధారిత ప్రోగ్రాముల అభివృద్ధికి అవసరమైన లైబ్రరీలు పుష్కలంగా ఉన్నాయి.
* జావా ఆధారంగా పనిచేసే అన్ని పరికరాల్లోనూ జే2ఎంఈ ఫ్రేమ్‌వర్క్ సహాయంతో ప్రోగ్రాములు అభివృద్ధి చేయవచ్చు. ఫోన్ల అప్లికేషన్ల అభివృద్ధి కూడా సులభం.
* విద్య, ఇన్సూరెన్స్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, ఆరోగ్యం వంటి రంగాలకు అనువైన ప్రోగ్రాములు ఇంటర్నెట్ ఆధారంగా నడిపేలా అభివృద్ధి చెయ్యవచ్చు.
* ఈ-కామర్స్ రంగంలో జావా ప్రోగ్రామర్ల అవసరం చాలా ఉంది.
* ఎంటర్‌ప్రైజ్ అప్లికేషన్ల అభివృద్ధి రంగంలో 90% పైగా జావా ఆధారిత ప్రోగ్రాముల వినియోగం ఉంది.
* వైజ్ఞానిక రంగంలో కూడా జావా ప్రోగ్రామింగ్ అవసరం చాలా ఉంది.
ఆన్‌లైన్‌లో ఇలా నేర్చుకుందాం:
1. https://www.learnjavaonline.org/
2.https://www.codecademy.com/learn/learn-java
3.https://docs.oracle.com/javase/tutorial/index.html
ఆర్ ప్రోగ్రామింగ్
ప్రోగ్రామర్లు, రిసెర్చి స్కాలర్లు విస్తృతంగా వాడే ప్రోగ్రామింగ్ లాంగ్వేజి ఇది. సమగ్రమైన ‘డేటా అనాలిసిస్’ నివేదికలను తయారుచెయ్యడానికి తయారైంది. ఫలితాలను పట్టికల రూపంలో, సాధారణ రిపోర్ట్‌ల రూపంలో లేదా గ్రాఫిక్స్ రూపంలోనూ రూపొందించే వెసులుబాటు ఉంది. గత ఐదారు సంవత్సరాల కాలంలో ఎంతో ప్రాచుర్యం పొంది ప్రస్తుతం ఐదో స్థానంలో ఉంది. ఉచితంగా అందుబాటులో ఉన్న ఏకైక స్టాటిస్టికల్ సాఫ్ట్‌వేర్ ప్యాకేజీ ఇది.
స్వయంసమృద్ధితో కూడుకున్న లైబ్రరీలతో సి, సి++, ఫోర్టాన్, పైతాన్, జావా లాంటి వైవిధ్య ప్రోగ్రాముల అనుసంధానానికి అనుకూలించే సామర్థ్యం దీనికుంది. గణితశాస్త్రంలోని వివిధ రీతులకు సంబంధించిన ప్యాకేజీలు కూడా ఆర్‌లో ఉన్నాయి. నేర్చుకోవడానికి కొంత కష్టపడాల్సి వస్తుంది గానీ ప్రోగ్రామింగ్‌లో ఎక్కువ ప్రావీణ్యం అవసరం లేదు.
ఎక్కడ ఉపయోగపడుతుంది?
* డేటా మైనింగ్ రంగంలో ఆర్ వినియోగం విస్తృతంగా ఉంది. * ప్రామాణికమైన స్టాటిస్టికల్ టెస్టులు, మోడల్స్ అభివృద్ధి, విశ్లేషణ వంటి క్లిష్టమైన, జటిలమైన పనులకు సమగ్రమైన సమాధానాలు అందిస్తుంది. * అన్ని రకాల ఆపరేటింగ్ సిస్టంలపై కూడా నడుస్తుంది. * ఇతర డేటాబేస్, డేటామైనింగ్ సాప్ట్‌వేర్‌ల ద్వారా సేకరించిన డాటాను కూడా దీనిలో నేరుగా వాడుకోవచ్చు. * ఐబీఎం, హెచ్.పి, ఆపిల్ మాక్ లాంటి అన్ని రకాల కంప్యూటర్లలోనూ; మైక్రోసాప్ట్, ఆండ్రాయిడ్, యూనిక్స్, లైనక్స్ వంటి అన్ని ఆపరేటింగ్ సిస్టంలలోనూ ఇబ్బందుల్లేకుండా ఉపయోగించవచ్చు.
ఆన్‌లైన్‌లో ఇలా నేర్చుకుందాం:
1. https://hackr.io/tutorials/learn-r.
2. https://data-flair.training/blogs/introduction-to-r-programming/
3. https://imarticus.org/certification-in-r-programming/
సి++
* నెట్‌వర్కింగ్ ఆధారిత ప్రోగ్రాములు, త్రీడీ గేములు, కంప్యూటర్ వనరుల సమర్థ నిర్వహణ అవసరమున్న సందర్భాల్లో సి++ అత్యంత వేగంగా పనిచేస్తుంది.
* గ్రాఫికల్ యూజర్ ఇంటర్‌ఫేస్ ఆధారిత అప్లికేషన్‌ల అభివృద్ధికి అనువుగా ఉంటుంది. ఇమేజ్‌రెడి, అడోబ్ ప్రీమియర్, ఫొటోషాప్, ఇలస్ట్రేటర్ వంటి సాఫ్ట్‌వేర్ ప్యాకేజీలు అభివృద్ధి అయినది సి++లోనే.
* బ్రౌజర్ల అభివృద్ధిలో పీహెచ్‌పీ, జావాలకే ప్రాధాన్యం ఉన్నా, వేగం అవసరమైన సందర్భాల్లో సి++ ఉపయోగం ఉంటుంది.
* గూగుల్, వికిపీడియా, యాహూ, యూట్యూబ్ వంటి ప్రజాదరణ పొందిన సాఫ్ట్‌వేర్‌లకి వెన్నెముకైన My SQL డేటాబేస్ ప్యాకేజీ సి++లో అభివృద్ధి అయింది.
* బ్యాంకింగ్, ట్రేడింగ్ వ్యవస్థలకు సంబంధించిన సాఫ్ట్‌వేర్ మొత్తం దీనిలోనే చేశారు.
* వైద్య, ఇంజినీరింగ్ రంగాల్లో అవసరమైన ప్రోగ్రాముల అభివృద్ధికి ఇది అనుకూలం.
ఆన్‌లైన్‌లో ఇలా నేర్చుకుందాం:
1. https://www.cprogramming.com/
2. www.learncpp.com 3. www.cpp.com
పైతాన్‌ను నేర్పే ‘స్నేకి¨ఫై!’
యువత మొబైల్స్‌లో, ఇతర ఉపకరణాల్లో అనునిత్యం చూసే గూగుల్, నెట్‌ఫ్లిక్స్, పింట్‌రెస్ట్, యూట్యూబ్, కోరా, రెడి…ట్, డ్రాప్‌బాక్స్, గూగుల్ మ్యాప్స్, యాహూలు పైతాన్‌నే ఉపయోగిస్తున్నాయి. చాలా సులువుగా నేర్చుకోగలిగే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇది. సరళమైన గేమ్స్ దగ్గర్నుంచి అడ్వాన్స్‌డ్ అప్లికేషన్లయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లర్నింగ్, డేటా అనలిటిక్స్ కోసం దీన్ని ఉపయోగిస్తారు.
ఎలాంటి సాంకేతిక స్థాయి లేకపోయినా తార్కిక పరిజ్ఞానం కోసం పాఠశాల విద్యార్థులైనా పైతాన్ నేర్చుకోవచ్చు. ఇక కళాశాల స్థాయి విద్యార్థుల సంగతి చెప్పనక్కర్లేదు. ఇందుకు www.snakify.org చాలా ఉపయోగపడే వెబ్‌సైట్. విద్యార్థులే కాకుండా పైతాన్‌ను బోధించేవారు కూడా నేరుగా ఈ ప్రోగ్రామింగ్ అభ్యాసం కోసం ఈ సైట్‌ను సాధనంగా వినియోగించుకోవచ్చు. దీనిలో ఈ ప్రోగ్రామింగ్‌ను అవగాహనకు ఉపకరించే కోడ్ స్నిపెట్స్‌తో కూడిన వివరణ, వివిధ స్థాయుల్లోని 150కి పైగా ప్రోగ్రామ్ ప్రాబ్లమ్స్... ప్రతి ప్రాబ్లమ్‌కూ కనీసం 5 టెస్ట్ కేసులూ ఉన్నాయి. స్టూడెంట్ డాష్‌బోర్డుతో ఉండటం వల్ల అధ్యాపకులు స్నేకిఫై వేదిక ద్వారా విద్యార్థుల అభివృద్ధిని గమనించి మార్కులను ఇవ్వవచ్చు. రకరకాల క్లిష్టతలున్న ప్రోగ్రాములు ఉండటం వల్ల విద్యార్థులు ఏ రకం సమస్యలను పరిష్కరించగలుగుతున్నారో అధ్యాపకులు గమనించి, వారి స్థాయిని నిర్దిష్టంగా పెంచటానికి వీలవుతుంది.
- పరుచూరి సతీష్ చంద్ర, ప్లేస్‌మెంట్ డైరెక్టర్, బీవీఆర్‌ఐటీ, శ్రీవిష్ణు

No comments:
Post a Comment