loading...
మన జీవితంలో అనుకోని ఒడుదొడుకుల వల్ల కొన్ని సార్లు ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ ఇబ్బందుల వల్ల ఒక్కోసారి మనం తీసుకున్న రుణాలపై చెల్లించే నెలవారీ వాయిదాల(ఈఎమ్ఐ)ను కట్టలేకపోవచ్చు. ఇలాంటి సందర్భంలో ఈ నెల చెల్లించలేని ఈఎమ్ఐని తరువాత నెలలో చెల్లించేలా బ్యాంకులు వెసులుబాటును కల్పిస్తాయి. అయితే ఇలా చెల్లించలేని ఈఎమ్ఐలపై పడే భారమేంటో మనం తెలుసుకుందాం.
ఆలస్య రుసుము
ఒక నెల కట్టకపోతే మనపై పెద్దగా ఆలస్య రుసుము(పెనాల్టీ) భారం పడదని సాధారణంగా అందరూ భావిస్తుంటారు. అయితే పడే నెలవారీ వడ్డీ పరంగా చూసుకుంటే ఇది పెద్ద మొత్తమే అవుతుంది. ఉదాహరణకు మీరు నెలకు రూ.30 వేలు ఈఎమ్ఐ కడుతున్నారని అనుకోండి. ఒక నెల మీరు ఈఎమ్ఐ కట్టలేపోతే, నెలవారీ మొత్తం రూ.30 వేలలో 2 శాతం మొత్తం రూ.600 ని కచ్చితంగా కట్టాల్సి ఉంటుంది.రుణ బదిలీకి ఇబ్బందులు తప్పవు
ఒక వేళ మీరు మూడు లేదా అంతకన్నా ఎక్కువ సార్లు ఈఎమ్ఐ కట్టకపోతే, మీ రుణాన్ని తక్కువ వడ్డీ పడే వేరే బ్యాంకులకు లేదా గృహ రుణాల కంపెనీలకు బదిలీ చేసేందుకు ప్రస్తుత బ్యాంకు అంగీకరించకపోవచ్చు. మిమ్మల్ని నష్టభయం(రిస్క్) ఉన్న కేటగిరిలో ఉంచుతారు గనుక వేరే సంస్థలు మీ రుణ బదిలీకి ఒప్పుకోరు.సిబిల్ స్కోరుపై ప్రభావం
ఒక్క నెల మీరు ఈఎమ్ఐ చెల్లించకపోయినా అది మీ సిబిల్ స్కోరుపై ప్రభావాన్ని చూపుతుంది. ప్రస్తుతం ప్రతీ బ్యాంక్, ఇతర ఆర్థిక సంస్థలు మీ రుణ చెల్లింపు సమాచారాన్న సిబిల్, ఇతర క్రెడిట్ బ్యూరోలకు ఎప్పటికప్పుడు అందిస్తున్నాయి. మీరు రుణాలను తిరిగి చెల్లించేటప్పుడు ఒక్క వైఫల్యం ఉన్నా మీ సిబిల్ స్కోరు 50 నుంచి 60 పాయింట్లు కోసుకుపోవచ్చు.ఉదాసీనంగా వ్యవహరించడం వల్ల ఒక్కోసారి మనం వాయిదాలను చెల్లించలేకపోవచ్చు. అలాంటి సందర్భాలలో పడే భారమేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
-
చెక్కులు బౌన్స్ అయినప్పుడు
ఒక్కోసారి మీ ఖాతాలో డబ్బులు లేనప్పుడు బ్యాంక్‌కి మీరు ఇచ్చిన పోస్ట్ డేటేడ్ చెక్కులు బౌన్స్ కావచ్చు. కొన్ని బ్యాంకులు మీపై అదనపు రుసుము(రూ.500 వరకు) తో పాటు మీరు చెల్లించాల్సిన బకాయిలపై 24 శాతం వార్షిక వడ్డీని పెనాల్టీగా విధించవచ్చు.
-
కొత్త చెక్‌బుక్‌లను సమర్పించనప్పుడు
12 నెలల తర్వాత మీరు కొత్త పోస్ట్ డేటేడ్ చెక్కులను ఇవ్వనప్పుడు మీపై బ్యాంకులు పెనాల్టీ విధించవచ్చు. కాబట్టి మీ చెక్‌బుక్‌లను రెన్యువల్ చేసుకుని సమయానికి ఈఎమ్ఐలు చెల్లించడం శ్రేయస్కరం.
-
చెక్కులపై తప్పులు
మీ చెక్కులపై గీతలుండటం, సంతకం సరిపోలక పోవడం ఇలాంటి కారణాలతోనూ చెక్కులు బౌన్స్ అయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి చెక్కులను నింపేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి.
loading...
No comments:
Post a Comment