Latest News

ఓ అమ్మ కధ... ప్రతి మదిని కదిలించే వ్యధ..!!

loading...

29 ఏళ్ల భారత వ్యక్తి, 28 ఏళ్ల అతడి భార్య తరచూ కన్నతల్లిని శారీరకంగా హింసించారు. వాతలు పెట్టడం, ఇష్టమొచ్చినట్లు కొట్టడం వల్ల వృద్ధురాలి పక్కటెముకలు విరిగిపోయాయి. దీంతో అంతర్గత రక్తస్రావం కావడం వల్ల ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అక్టోబర్ 31న చనిపోయింది. వృద్ధురాలి ఒంటిపై వాతలు, తీవ్రంగా కొట్టిన దెబ్బల గుర్తులతో పాటు ఆమె కుడి కన్ను కనుపాపను కూడా ఆ దంపతులు కత్తిరించినట్లు ఆమెకు చికిత్స అందించిన వైద్యులు తెలిపారు. గతేడాది జూలై నుంచి అక్టోబర్ వరకు ఆ దంపతులు వృద్ధురాలిని నరకం చూపించారు. తల్లి అని కూడా చూడకుండా శారీరకంగా హింసించడంతో బాధితురాలి పక్కటెముకలు విరిగిపోయి అంతర్గత రక్తస్రావం జరగడంతో చనిపోయింది. అంతేగాక చాలా రోజులుగా ఆమెకు ఆహారం పెట్టకపోవడంతో ఆకలితో అలమటించినట్టు పోస్టుమార్టం రిపోర్టులో వచ్చింది. ఈ మేరకు అల్ ఖుసైస్ పోలీస్ స్టేషన్‌లో దంపతులపై కేసు నమోదైంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తన కూతురును చూసుకోవడానికని తల్లిని ఇండియా నుంచి దుబాయి పిలిచాడు కొడుకు. దాంతో దుబాయికి వెళ్లిందా తల్లి. కొడుకు, కోడలు డ్యూటీకి వెళ్తుండడంతో మనవరాలిని చూసుకుంటూ ఇంటి వద్దనే ఉండేది. అయితే, కొన్ని రోజుల తరువాత కూతురు పలుమార్లు అనారోగ్యం బారిన పడడంతో తన బిడ్డను సరిగ్గా చూసుకోవడం లేదంటూ అత్తను కోడలు కోపగించుకోవడం మొదలెట్టింది. అలా మాటలతో మొదలైన వారి టార్చర్ చివరకు చేయి చేసుకునే వరకు వెళ్లింది. ఇష్టానుసారంగా కొట్టడం, ఒంటిపై వాతలు పెట్టడం, రోజుల తరబడి అన్నం పెట్టకుండా ఉంచడం చేశారు. గతేడాది జూలై నుంచి అక్టోబర్ వరకు దంపతులు ఆ ముసలావిడాను ఇలా నరకం చూపించారు. ఎంతలా హింసించారంటే ఆ పెద్దావిడా చనిపోయే సమయానికి కేవలం 29కిలోల బరువు మాత్రమే ఉందట. ఒకరోజు ఆమెను తీవ్రంగా కొట్టి ఇంటి నుంచి గెంటేశారు దంపతులు.

ఒంటిపై తీవ్రమైన గాయాలతో సరిగ్గా బట్టలు కూడా లేని ఆమె వెళ్లి పొరుగింటి బాల్కనీలో పడుకుంది. తన ఇంటి ఎదుట ముసలావిడను గమనించిన ఓ వ్యక్తి ఆమె కొడుకు వెళ్లి చెప్పాడు. నీ తల్లి పరిస్థితి విషమంగా ఉందని, వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలని కోరాడు.

కానీ, కొడుకు దానికి ససేమీరా అనడంతో అక్కడి వాళ్లే ఆమెను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అక్టోబర్ 31న ఆమె చనిపోయింది. దీంతో పోలీసులు ఆ దంపతులపై కేసు నమోదు చేసి కటకటాల్లోకి నెట్టారు. తాజాగా ఈ కేసు దుబాయి కోర్టులో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా కొడుకును తల్లి ఒంటిపై ఉన్న గాయాల గురించి ప్రశ్నించగా తనపై తానే వేడి నీళ్లు పోసుకోవడంతో గాయాలైనట్లు చెప్పుకొచ్చాడు. కాగా, పోస్టుమార్టం రిపోర్టులో శారీరకంగా హింసించడం, చాలా రోజులుగా ఆహారం పెట్టకపోవడంతో ఆకలితో అలమటించి చనిపోయినట్లు వచ్చింది. దంపతులు తమ నేరాన్ని అంగీకరించడంతో న్యాయస్థానం వారికి పదేళ్ల జైలుతో పాటు దేశ బహిష్కరణ శిక్షను విధించింది.

ఈ ఘాతుకం బయటకు వచ్చిందిలా... కన్నతల్లి పట్ల క్రూరంగా ప్రవర్తించి ఆమె చావుకు కారణమైన దంపతుల గురించి మొదట వారి అపార్ట్‌మెంట్లోనే ఉండే మరో భారత వ్యక్తి ద్వారా ఈ ఘాతుకం బయటకు వచ్చింది. ఆసుపత్రిలో ఉద్యోగం చేసే 54 ఏళ్ల భారత వ్యక్తి ఒక రోజు తన పక్కింట్లో ఉండే మహిళ ఓ చిన్నారిని తీసుకొని తమ ఇంటికి రావడం గమనించాడు. ఆ సందర్భంలో ఆమె తన అత్తగారిని దుర్భాషలాడటం విన్నాడు. తన కూతురిని చూసుకోవడానికి ఆమెను ఇండియా నుంచి రప్పించామని చెప్పిందామె.

కానీ చిన్నారి పట్ల ఆమె ఏ మాత్రం జాగ్రత్త వహించడం లేదని, దాంతో తన కూతురు తరచూ అనారోగ్యం బారిన పడుతోందని చెప్పుకొచ్చింది. అందుకే తాను పని చూసుకొని వచ్చే వరకు తన కూతురును చూసుకోమని తమ వద్ద ఉంచి వెళ్లిందని తెలిపాడు. ఇది జరిగిన మూడు రోజుల తరువాత పొరుగింటివారి బాల్కనీలో వృద్ధురాలు చిరిగిపోయిన బట్టలతో, ఒంటిపై తీవ్రమైన గాయాలతో పడి ఉండడం చూశాడు. దాంతో వెంటనే సెక్యూరిటీ గార్డుకు సమాచారం ఇచ్చి, ఆమె కొడుకు ఇంటి తలుపులు కొట్టాడు. మీ తల్లి ఒంటిపై గాయాలతో ఎదురింటి వారి బాల్కనీలో పడి ఉందని, ఆమెకు చాలా సీరియస్‌గా ఉందని దంపతులతో చెప్పాడు.
కానీ ఆ దంపతులు ఆమెను కనీసం చూడటానికి కూడా నిరాకరించారు. దీంతో ఆ అపార్ట్‌మెంట్ వారే అంబులెన్స్‌ను పిలిపించి చికిత్స కోసం వృద్ధురాలిని ఆసుపత్రికి తరలించారు.

తల్లితో వెళ్లాలని ఆమె కొడుకును చెప్పిన పట్టించుకోలేదు. తీవ్రమైన గాయాలతో ఆసుపత్రిలో చేరిన పెద్దావిడా చికిత్స పొందుతూ మృతిచెందింది.

దీంతో అల్ ఖుసైస్ పోలీస్‌లకు సమాచారం అందించారు ఆసుపత్రి యాజమాన్యం. వెంటనే అక్కడికి వెళ్లిన పోలీసులు మృతురాలి కొడుకు, కోడలిని ఆసుపత్రికి పిలిచి విచారించారు. కానీ వారు తమ తప్పు ఏమీ లేదని బుకాయించారు. అయితే పోస్టుమార్టం రిపోర్టులో వృద్ధురాలు శారీరకంగా హింసించడం వల్లే చనిపోయిందని రావడంతో దంపతులు దొరికిపోయారు. వెంటనే వారిపై కేసు నమోదు చేసి జైలులో పెట్టారు. తాజాగా ఈ కేసు దుబాయ్ కోర్టులో విచారణకు వచ్చింది. విచారణలో దంపతులు తమ నేరాన్ని అంగీకరించడంతో వారికి న్యాయస్థానం శిక్షను ఖరారు చేసింది.
loading...

No comments:

Post a Comment

Teenmar News | Online English, Telugu,Telangana News Portal Designed by Templateism.com Copyright © 2014

Powered by Blogger.