Latest News

40వేలు జీతంతో చావలేక బతుకుతున్న మధ్య తరగతి మనిషి... అంతరంగం..!!

loading...
నువ్వు నిజాయితీగా కట్టే TAX వల్ల...
అమ్మ వడి 15000 నీకు రావు ఐటీఐ,డిగ్రీ చదివే పిల్లలువుంటే వసతి 15000 రావు...
రైతు భరోసా 12000 రావు.
పంట కోసం రుణం తీసుకుంటే రుణమాఫీ నీకు రాదు..టైం బాగా లేక పంట సరిగా పండక పోతే మద్దతు ధర నీకు రాదు.
బియ్యం కార్డు నీకు రాదు (20kgx50rsx12months)--12000 పెట్టి బియ్యం కొనాల్సిందే.
ఉగాదికి ఇళ్ల స్థలం నీకు రాదు.
ఇల్లు కట్టాలంటే ప్రభుత్వం ఇచ్చే 2లక్షల రూపాయలు నీకు రావు.
డబుల్ బెడ్ రూమ్ ప్లాట్ నీకు ఇవ్వరు.
ఆరోగ్య శ్రీ కార్డ్ నీకు యివ్వరు.
ఎంత బిల్లు ఆయినా నువ్వు కట్టాల్సిందే.
నీకు ఇన్కమ్ సర్టిఫికెట్ ఎక్కువ ఉంది కాబట్టి నీ పిల్లల ఫీజు... నువ్వు కట్టాలి...
ఇక నీపిల్లలు ఇంజనీరింగ్/ MBBS చదువు? ఒక కల
అందుకే పని పాట మానేసి ఊరికే ఉంటే ...
టాక్స్ కట్టే పని లేదు....ప్రభుత్వం నుండి నిరుద్యోగ భృతితోపాటు పైన నేను చెప్పినవన్నీ పొందొచ్చు.
కష్టపడి జాబ్ చేసి సంవత్సరం చివర నీకు మిగిలింది ఏంది....బజాజ్ ఈఎంఐ(EMI) లు తప్ప.
నెలకు జీతం 40 వేలు అనుకో
  • ఇంటి అద్దె 6000
  • పాలు. 1800 1లీ 60 రూ
  • కరెంట్ బిల్. 1000
  • రైస్ 50 kg x50rs 2500
  • కూరగాయలు 1000
  • ఆయిల్..వగేరా. 3000
  • సండే చికెన్. 4వాx200. 800
  • కార్ లేక బైక్ పెట్రోల్.3000- 5000
  • పిల్లల ఫీజు. 2000x2 నెలకి
  • (LKG కూడా 20వేలు కాబట్టి ఒక్కడికి)
  • (నాకు ఇద్దరు పిల్లలు కాబట్టి నెలకు 4000 వేలు)
  • పిల్లలకి ప్రతి నెల హాస్పిటల్స్ కి 2000 అవతాయి.
  • ఆరోగ్య శ్రీ లేదుగా ఇన్సూరెన్స్ కట్టాలి.
  • నెలకు 4లుగురికి 4000 వేలు..
  • ఇప్పటికే 30 వేలు అయి0ది.. నెలకు మినిమం ఖర్చు....ఇక పండగలు పెళ్లిళ్లు/ బర్త్ డే లు

అమ్మ వాళ్ళ ఊరు...
అత్తగారి ఊరు ప్రయాణాలు...ఖర్చులు....
ఇవన్నీ కాక....40వేల జీతం కదాఅని పెళ్ళాం వచ్చి
మంచి ఫోన్ కొను
ఏసీ కొను
ఫ్రిడ్జ్ కొను
వాషింగ్ మెషీన్ కొను
సోఫా కొను
గోల్డ్ కొను
బొక్క కొను
భూషణం కొను
అంటే ఉంటాయా.......ఏమన్నా అంటే
40వేలు జీతం ఎమ్ చేస్తావ్ అంటారు...
సరే...ఏదో అడుగుతుందిగా అని BANKకి వెళితే ....టాక్స్ రిటర్న్స్ కట్టిన కాగితాలు తీసుకురా అంటాడు...
ఎమి మిగిలింది అని టాక్స్ కట్టడానికి....40వేలు అయిపోయి ...పక్కన ఫ్రెండ్ ని అడుగుదాం అంటే వాడిపరిస్తితి అంతే....
సరే అడిగింది కదాఅని బజాజ్ లో EMI లోకొంటె మల్ల నెలనెలా వాడి గోల.. కాస్త జీతం లేటఇతే.. ఎవర్ని అడిగినా...ఇదేమాట...నేను కట్టాలి బ్రో అని
ఎలాగోలా టాక్స్ కడుతూ నెట్టుకొస్తుంటే ఒక రోజు ఫంక్షన్ కి చుట్టాలు వచ్చి...
అయ్యా 40వేలు జీతం కదా ...
స్థలం కొన్నవా....
ఇల్లు కట్టవా అని....🤦‍♂ ..
(ఎందిరా ఈగోల....) 40వేల జీతంతో స్థలం కొనలేం...ఇల్లు కట్టలేం...
ప్రభుత్వం స్థలం ఇవ్వదు.... నేను కొనలేను..
ప్రభుత్వం డబుల్-బెడ్-రూమ్ ఇల్లు ఇవ్వదు....
నేను కట్టలేను...
40వేలు జీతంతీసుకుని నేను పీకింది ఏంది.....
జాబ్ మానేసి.....కాళీగా ఉంటే....
పైన చెప్పిన వన్నీ వస్తాయి....ఏ గోల ఉండదు.....🕺
loading...

No comments:

Post a Comment

Teenmar News | Online English, Telugu,Telangana News Portal Designed by Templateism.com Copyright © 2014

Powered by Blogger.