loading...
ఇదిఅమెరికా... | కాలిఫోర్నియాలో ఉంటున్న 36 సంవత్సరాల NRI మహిళకి తన భర్త తో రోజు గొడవలు జరుగుతూ ఉంటాయి. వారిరువురి మధ్య గొడవలకు ముఖ్య కారణం పిల్లలను క్రమ శిక్షణలో పెట్టడం గురించి. తల్లిగా తాను చాల స్ట్రిక్ట్ గా ఉండాలని ప్రయత్నం చేస్తుంటే భర్త మాత్రం వారిని స్వేచ్ఛగా వదిలేయ మంటున్నాడు. ఆ క్రమంలో పిల్లలకు మార్కులు తక్కువగా రావడం, మొబైల్ అడిక్ట్ అవ్వడం జరిగింది.
ఆ ముందు రాత్రి పిల్లల ముందే ఆ భార్యాభర్తలు ఒకరిని ఒకరు దూషించు కున్నారు. పిల్లలు అలా అవ్వడానికి కారణం నువ్వంటే నువ్వని తిట్టుకున్నారు. భర్త భార్య మీద F*** వర్డ్స్ కూడా ప్రయోగించాడు. తీవ్రంగా బాధ పడిన భార్య మర్నాడు ఉదయం నాకు ఫోన్ చేసి మాట్లాడింది.
తన భర్త పిల్లల ముందు F*** వర్డ్స్ ప్రయోగించడం తనకు నచ్చదు. ఇంతకు ముందు కూడా చాలా సార్లు భర్త అసహనానికి గురయినపుడు పిల్లల ముందు F*** వర్డ్స్ ప్రయోగించడం జరిగింది. చాలా కోపంలో ఉన్న ఆమె తన భర్తను పిల్లలను వదిలి వెళ్లి పోవాలని నిర్ణయించుకుంది. తన నిర్ణయం ఎంతవరకు సరయినదో తెలుసుకోవడానికి నాకు ఫోన్ చేసి మాట్లాడింది. చాలా సేపు ఏడుస్తూ ఎమోషనల్ గా మాట్లాడిన ఆమె సంభాషణలో అంశాలు క్లుప్తంగా....
'సో.. మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా బ్రతకాలి అన్న అంశాల మీద క్లారిటీ ఉంది. మీకు వెళ్ళిపోయి బ్రతకడానికి సరిపడా డబ్బు, అవకాశాలున్నాయి.'
'అవును. ఇది అమెరికా. ఎవరికి నచ్చక పోయినా వేరుగా బ్రతకడం ఇక్కడ సహజం.'
'అవును. అసలు మీరు విడిపోవాలి అనుకోవడానికి కారణం ఏంటి?'
'నా భర్త నా పట్ల ప్రవర్తించే తీరు. ఇంకా నా పిల్లలను క్రమశిక్షణలో పెంచడానికి అతను సహకరించడం లేదు.'
'క్రమశిక్షణలో పెంచక పోతే ఏమవుతుంది?'
'అదేంటండి? క్రమ శిక్షణలో పెంచక పోతే వాళ్ళు చెడిపోతారు. నా కొడుకుకు 80 శాతం మార్క్స్ వస్తున్నాయి. తను ఎఫోర్ట్స్ పెడితే ఈజీగా 90 శాతం వచ్చే అవకాశం ఉంది. 90 కాక పోయినా 85 వచ్చినా సరిపోతుంది. అంతే కాదు నా కొడుకు డ్రగ్ అడిక్ట్ అవుతాడని భయం వేస్తుంది.'
'ఓకే.. ఒక 5 శాతం మార్కులు పెరగడం లేదని మీరు ఫామిలీని విచ్చినం చేసుకో దలిచారు.'
'అంతే కాదు క్రమశిక్షణ నేర్పక పోతే నా కొడుకు డ్రగ్ అడిక్ట్ అవుతాడు.'
'మీ కొడుకు ఇంత వరకు డ్రగ్ అడిక్ట్ అవ్వలేదు. అవుతాడని భయం మీకు ఉంది. అవుతాడని నమ్ముతున్నారు. ఒక వేళ మీరు భర్త నుండి పిల్లలనుండి విడిపోతే అతను డ్రగ్ అడిక్ట్ అవ్వకుండా ఉండే అవకాశాలు పెరుగుతాయా? అడిక్ట్ అయ్యే అవకాశాలు పెరుగుతాయా?'
'...'
'మీ కొడుకు మంటల్లో పడతాడేమో అనే భయంతో మీరు అతనిని మంటల్లోకి తోసి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. మీరు ఉండడం వల్ల డ్రగ్ అడిక్ట్ అవుతాడో లేదో గాని ఫామిలీ బ్రేక్ అయితే ఆ అవకాశాలు పెరుగుతాయి.'
'...'
'మీరు విడిపోయే విషయంలో ఇది అమెరికా ఎప్పుడయినా విడిపోయే స్వేచ్ఛ ఉంది అన్నారు. కానీ ఇది అమెరికా నా పిల్లలు స్వేచ్ఛగా పెరుగుతారు అనడం లేదు. అలాగే మీరు విడిపోవడం వల్ల మీరు ఏదయితే జరగ కూడదని భయపడుతున్నారో అదే కచ్చిత్తంగా జరిగే అవకాశాలెక్కువ.'
'...'
'వైద్యం ఎప్పుడూ కూడా జబ్బుకన్నా ఎక్కువ నష్టాన్ని కలిగించ కూడదు. అటువంటి సందర్భంలో వైద్యం మానివేయడం బెటర్. మీ భర్త మీ మీద ప్రయోగించే పదాలు ఆక్షేపణీయమే. కానీ దానికి పరిష్కారం ఇది కాదేమో...'
'...'
అలా దాదాపు రెండు గంటల సంభాషణ సాగిన తరువాత హ్యాపీగా థాంక్స్ చెబుతూ ఫోన్ పెట్టేసింది.
loading...
No comments:
Post a Comment