Latest News

అజానుబాహుడు అయిన స్వామి వారి శిలా రూపం ఎలా వచ్చిందో తెలుసు కుందాము.!!

loading...
స్వామివారి శిలా రూపం ఎలా వచ్చిందో ?
అజానుబాహుడు అయిన స్వామి వారి శిలా రూపం ఎలా వచ్చిందో తెలుసు కుందాము.. శ్రీనివాసమహత్యం సినిమా చూసి అందులో స్వామివారు భార్యల గొడవ చూసి ఏడు అడుగులు వెనక్కి వెళ్లి శిల గా మారినట్టు డైరెక్టర్ పుల్లయ్య గారు కల్పించిన క్లైమాక్స్ నే నిజమనుకునే వారు చాలా మంది ఉన్నారు అలా బిమ్మల పుస్తకాలు కూడా ప్రచురించే వరకు అదే నిజమని వ్యాపించింది కానీ అది వాస్తవం కాదు..
స్వామివారు స్వయంగా మాట్లాడుతున్న రోజులవి.
అవును, శ్రీవేంకటేశ్వరస్వామి (శ్రీవారు) మాట్లాడేవారు.
శ్రీవారు శిలారూపముగా మారినతువాత కూడా మహాభక్తులతో మాట్లాడేవారట,అన్నమయ్య,మరియు హథీరామ్ బావాజీ లాంటి భక్తులతో ఏకంగా వచ్చి ప్రత్యక్ష పాచికలాడేవారట, ఆయనతో అనునిత్యం మాట్లాడేవారట
.
ఒకానొకప్పుడు 'తొండమాను చక్రవర్తి' చేసిన పనికి ఆగ్రహించి మాట్లాడటం మానేసారు.
పూర్వం "కూర్ముడు" అనే బ్రాహ్మణుడు కాశీకి పోతూ, తాను తిరిగి వచ్చే వరకూ తన భార్యాపిల్లలను కాపాడమని తొండమాను రాజుకు అప్పచెప్పాడు.
ఆ రాజు వారికి ఒక భవనంలో సకల సౌకర్యాలు కలుగచేసి, భద్రతకై తాళం వేసి ఉంచాడు. తర్వాత ఆ విషయం మరిచిపోయాడు. ఆ భవనంలోనివారు ఆహారం చాలక లోపలే మరణించారు.
ఒక సంవత్సరం తర్వాత బ్రాహ్మణుడు కాశీ నుంచి వచ్చాడు. ఆ విషయమే మరచిన తొండమానుడు, భవనంలో చనిపోయిన వారిని చూసి భయపడి, వేంకటాచలానికి పరుగెత్తి వెళ్ళి, శ్రీనివాసుని పాదాలపై పడి శరణువేడాడు.
అప్పుడు శ్రీవేంకటేశ్వరుడు "నీకు బ్రహ్మహత్యాపాపం చుట్టుకుంది. కానీ నీకు అభయం ఇచ్చినందువల్ల నిన్ను రక్షిస్తాను. అందుకు ప్రతిఫలంగా ఇకముందు ఎవరికి ప్రత్యక్షంగా కనిపించను.ఎవరితోనూ ప్రత్యక్షంగా మాట్లాడను" అంటూ శపధం చేసి, ఆ బ్రాహ్మణుడి కుటుంబాన్ని బ్రతికించాడు.
అప్పుడు బ్రహ్మాదిదేవతలు "బలహీనులు, అల్పాయుష్కులైన మానవులను ఉద్దరించడానికై కలియుగాంతము వరకూ ఈ వేంకటాచలంపై ఉండవలసింది" అని ప్రార్ధించారు.
దానికి శ్రీనివాసుడు "దివ్యమూర్తిగా దర్శనమిస్తాను. కానీ ఎవరితోనూ మాట్లాడను. అందరి కోరికలూ తీరుస్తాను" అంటూ "కన్యామాసం, శ్రవణానక్షత్రం" రోజున దివ్యమైన సాలగ్రామ శిలామూర్తిగా ఆవిర్భవించారు. తొండమానుడు ఆలయగోపురాదులు నిర్మించాడు.
బ్రహ్మదేవుడు రెండు అఖండ దీపాలు వెలిగించి, ఇవి కలియుగాంతం వరకూ వేలుగుతూంటాయని చెప్పాడు. తరువాత పదిరోజులపాటు ఉత్సవాలు నిర్వహించాడు. అవే ఆ తర్వాత కాలంలో బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధిపొందాయి.
"భగవంతుడి నామాన్నినిత్యం జపిద్దాం,
భగవంతుడిని మనసుతోనైనా చేరుకుందాం.
కలౌ వెంకటనాయక , కలియుగంలో పిలిస్తే పలికే ప్రత్యక్ష దైవం నారాయణుడు.. స్వామి అనుగ్రహం అందరికి ఉండాలి.
"ఓం నమో వేంకటేశాయ"
"ఓం నమో వేంకటేశాయ"
"ఓం నమో వేంకటేశాయ"
loading...

No comments:

Post a Comment

Teenmar News | Online English, Telugu,Telangana News Portal Designed by Templateism.com Copyright © 2014

Powered by Blogger.