Latest News

మహాలక్ష్మి అమ్మవారి రెండుచేతుల్లోను పద్మాలు ఎందుకు...?

loading...
మహాలక్ష్మి అమ్మవారిని శ్రీసూక్తంలో పద్మ విశేషాలతో వర్ణిస్తారు. ఋగ్వేదంలో అమ్మవారి గురించి ఎన్నో ఋక్కులు కనబడతాయి. “పద్మాననే పద్మ ఊరు పద్మాక్షీ పద్మ సంభవే” అని అన్ని పద్మ విశేషణాలు వాడారు. పద్మాల వంటి కన్నులు కలది, పద్మం ఆధారంగా ఉన్నది, పద్మం వంటి మోము కలది, పద్మం నుండి పుట్టినది అని సూక్తం వర్ణిస్తుంది. పంకం నుండి పుట్టినది పద్మం కానీ ఆ చిక్లీతను (బురదను) అంటించుకోదు. సంసారంలో ఆ పద్మంలాగా ఉండాలని సూచిస్తుంది. పద్మం సూర్యుని చూసి వికసిస్తుంది, అలాగే మనం కూడా పరమాత్మ వైపు మంచి విషయాలపై మాత్రమె నీకు అనురక్తి ఉండాలి అని మరొక సంకేతార్ధం. నీటి మీద ఉన్న ఆ పద్మం చాలా చంచలం. ఆ పువ్వు మీద ఆసీనురాలైన ఆవిడ కూడా ధర్మం ఉన్నన్నాళ్ళే వారి దగ్గర ఉంటుంది. విష్ణు నాభి కమలం నుండి ఉద్భవించాడు చతుర్ముఖ బ్రహ్మ, అటుపై అక్కడనుండి సృష్టి ఆవిర్భావం. ఆ బ్రహ్మతత్త్వాన్ని తెలిపే సంకేతంగా మరొక పద్మం. అమ్మవారి రెండు కర కమలాలలో భౌతిక, ఆధ్యాత్మిక ఉన్నతి అనుగ్రహాలు ఉన్నాయి. వాటికి చిహ్నంగా అలా కనిపిస్తుంది. ఆవిడ రూపాన్ని ఋషులు, మహర్షులు ధ్యానతపస్సులో దర్శించి తరించారు. వాటినే మనకు అందించారు. ఆ విశేషాలు మరింత విపులంగా ఏ ఏ రూపంలో ఏమి ధరించిందో క్రింద వివరంగా ఉన్నాయి.
లక్ష్మీదేవి 16 రకాల సంపదను అనుగ్రహించే తల్లి: జ్ఞానం, తెలివి, బలం, శౌర్యం, వీరం, అందం, జయం, కీర్తి, ధృతి, నైతికత, ధనం, ధాన్యం, ఆనందం, ఆయుష్షు, ఆరోగ్యం మరియు సంతానం. ఆవిడ మానవుల కోరికలను తీర్చేందుకు ఎనిమిది రూపాలలో అష్టలక్ష్మిగా సుప్రసిద్ధం.


1. ఆదిలక్ష్మి ( అనాది, మహాలక్ష్మి ), ఆదినారాయణుని నిత్యానుపాయిని. ఆవిడ శ్రీమన్నారాయణునికి సేవ చేస్తున్నట్టు మహర్షులు దర్శించారు. పతికి సేవ చేస్తున్నట్టు కనబడే ఆవిడ సృష్టికి సేవ చేస్తున్నట్టు సంకేతార్ధం. ఈవిడ ఒక చేతితో పద్మం, ఒక చేతిలో తెల్లని ఝండాతో అభయ, వరద ముద్రలతో చతుర్భుజములతో అగుపిస్తుంది.
సుమనసవందిత సుందరి మాధవి చంద్రసహోదరి హేమమయే |
మునిగణమండిత మోక్షప్రదాయిని మంజుళభాషిణి వేదనుతే ||
పంకజవాసిని దేవసుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే |
జయజయ హే మధుసూదనకామిని ఆదిలక్ష్మి సదా పాలయ మామ్ || 1 ||


2. ధనలక్ష్మి – ధనం అంటే భౌతికంగా బంగారం, డబ్బు అనిపించినా ధృతి, శౌర్యం, వ్యక్తిత్వం, ప్రతిభ, ధైర్యం ఇలా ఎన్నో అర్ధాలు వస్తాయి. ఎర్రటి వస్త్రంతో, శంఖచాక్రాలతో, కలశంతో, ధనుస్సు, పద్మాలతో, అభయ ముద్రతో షష్టభుజిగా దర్శించారు ఋషులు ఈవిడను.
అహికలికల్మషనాశిని కామిని వైదికరూపిణి వేదమయే |
క్షీరసముద్భవ మంగళరూపిణి మంత్రనివాసిని మంత్రనుతే ||
మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే |
జయజయ హే మధుసూదనకామిని ధాన్యలక్ష్మి సదా పాలయ మామ్ || 2 ||


3. ధాన్యలక్ష్మి – ఆరోగ్యకరమైన శరీరం, మనస్సుకు కావలసిన గ్రాసం అనుగ్రహించే తల్లి. హరిత వర్ణ చీరలో, రెండు పద్మాలతో, ధాన్యంతో, చేరుకుగడతో, అరటి గెలతో, వరద అభయముద్రలతో అష్టభుజిగా దర్శించారు.
జయవరవర్ణిని వైష్ణవి భార్గవి మంత్రస్వరూపిణి మంత్రమయే |
సురగణపూజిత శీఘ్రఫలప్రద జ్ఞానవికాసిని శాస్త్రనుతే ||
భవభయహారిణి పాపవిమోచని సాధుజనాశ్రిత పాదయుతే |
జయజయ హే మధుసూదనకామిని ధైర్యలక్ష్మి సదా పాలయ మామ్ || 3 ||


4. గజ లక్ష్మి – పాలసముద్ర మధనంలో ఉద్భవించిన గజలక్ష్మి ఇంద్రుని కరుణించి, ఆర్తులకు ధనం, గౌరవం, స్థితి, అనుగ్రహం, ప్రతిష్టలను ఇచ్చి రక్షించే తల్లి. రెండు గజాలు ఈవిడకు అభిషేకం చేస్తుండగా ఎర్రటి వస్త్రంతో కమలంలో కూర్చుని రెండు కరములలో రెండు పద్మాలతో, వరద అభయ హస్తాలతో, అక్షయపాత్ర ద్వారా అక్షయమైన ధనాన్ని అనుగ్రహించే ముద్రలో దర్శించి తరించి మనకు ఆ రూపాన్ని అందించారు.
జయ జయ దుర్గతినాశిని కామిని సర్వఫలప్రద శాస్త్రమయే |
రథగజతురగపదాదిసమావృత పరిజనమండిత లోకనుతే ||
హరిహరబ్రహ్మసుపూజితసేవిత తాపనివారిణి పాదయుతే |
జయజయ హే మధుసూదనకామిని గజలక్ష్మి రూపేణ పాలయ మామ్ || 4 ||


5. సంతాన లక్ష్మి – ఈవిడ దయవలన మానవాళికి సత్సంతానభాగ్యం కలుగుతోంది. ఈవిడ రెండు చేతులలో కళాశాలతో, ఖడ్గం, డాలు ధరించి, అభయ ముద్రతో, ఒక చేతితో పద్మం ధరించిన ఒక పిల్లవాని ఒడిలో కూర్చోబెట్టుకుని కనబడుతుంది.
అహిఖగ వాహిని మోహిని చక్రిణి రాగవివర్ధిని జ్ఞానమయే |
గుణగణవారిధి లోకహితైషిణి స్వరసప్తభూషిత గాననుతే ||
సకల సురాసుర దేవమునీశ్వర మానవవందిత పాదయుతే |
జయజయ హే మధుసూదనకామిని సంతానలక్ష్మి త్వం పాలయ మామ్ || 5 ||


6. ధైర్యలక్ష్మి/వీరలక్ష్మి – శౌర్యం, బలం ధైర్యం కేవలం బాహ్యంలోనే కాక కష్టాలను అధిగమించే శక్తిని అనుగ్రహించే ధైర్య లక్ష్మి తల్లి. శంఖ చక్రాలతో, ధనుస్సు, బాణం, ఖడ్గం, పాత్రలను ధరించి, అభయ వరద హస్తాలతో అష్టభుజిగా దర్శనం ఇస్తుంది ఈవిడ.
జయ కమలాసని సద్గతిదాయిని జ్ఞానవికాసిని గానమయే |
అనుదినమర్చిత కుంకుమధూసరభూషిత వాసిత వాద్యనుతే ||
కనకధరాస్తుతి వైభవ వందిత శంకరదేశిక మాన్య పదే |
జయజయ హే మధుసూదనకామిని విజయలక్ష్మి సదా పాలయ మామ్ || 6 ||


7. విద్యాలక్ష్మి – జ్ఞానం, విద్య అనుగ్రహించే అమ్మ. శ్వేత వర్ణ వస్త్రధారి. రెండు పద్మాలతో, అభయ వరద హస్తాలతో అనుగ్రహించే అమ్మవారు.
ప్రణత సురేశ్వరి భారతి భార్గవి శోకవినాశిని రత్నమయే |
మణిమయభూషిత కర్ణవిభూషణ శాంతిసమావృత హాస్యముఖే ||
నవనిధిదాయిని కలిమలహారిణి కామిత ఫలప్రద హస్తయుతే |
జయజయ హే మధుసూదనకామిని విద్యాలక్ష్మి సదా పాలయ మామ్ || 7 ||


8. విజయలక్ష్మి – అన్నింటా జయం కలిగించే తల్లి. శంఖచక్రాలు, డాలు, ఖడ్గ పాశాలతో, పద్మం ధరించి అభయ వరద ముద్రలతో అష్టభుజిగా దర్శనం అనుగ్రహిస్తుంది అమ్మవారు.
ధిమిధిమి ధింధిమి ధింధిమి ధింధిమి దుందుభి నాద సుపూర్ణమయే |
ఘుమఘుమ ఘుంఘుమ ఘుంఘుమ ఘుంఘుమ శంఖనినాద సువాద్యనుతే ||
వేదపురాణేతిహాస సుపూజిత వైదికమార్గప్రదర్శయుతే |
జయజయ హే మధుసూదనకామిని ధనలక్ష్మి రూపేణ పాలయ మామ్ || 8 ||


నిత్యం మా వేంకటేశుని వక్షస్థలంపై వసించి మమ్మల్ని అనుగ్రహించి, మా తరపున మా మొరలు మా స్వామికి నివేదించి మనల్ని రక్షిస్తూ, అనుగ్రహిస్తున్న మా అమ్మ లక్ష్మి దేవకి సాష్టాంగనమస్కారం చేస్తూ ఆవిడ అనుగ్రహాన్ని అభిలషిస్తూ


Contact
Gyana Chandra Mamidi

Astrology and Vastu consultant
093461 42498
loading...

No comments:

Post a Comment

Teenmar News | Online English, Telugu,Telangana News Portal Designed by Templateism.com Copyright © 2014

Powered by Blogger.