loading...
భార్యాభర్తలిద్దరూ ఇటలీలోని ఒక హాస్పిటల్ లో నర్సులుగా పనిచేస్తున్నారు. ఆమె పేరు సోఫియా, అతడి పేరు ఆంటోనియో. వారికి కారా, లియా అని ఇద్దరు పిల్లలు. వారిద్దరినీ నానమ్మ ,తాతయ్యల వద్ద వదలిపెట్టి ,రేయింబవళ్ళు హాస్పిటల్ లో కరోనా వైరస్ సోకిన రోగుల సేవలో గడుపుతున్నారు. పిల్లలకు ఆ వ్యాధి ఎక్కడ సోకే అవకాశం ఉంటుందో అనే భయంతో,వారిని కలవడానికి కూడా ఇంటికి పోకుండా హాస్పిటల్ లోనే ఉండిపోయారు. ( వాస్తవమేమై ఉండవచ్చంటే, హాస్పిటల్ కు పరుగులు తీస్తూ వస్తున్న వైరస్ బాధితుల పరిస్థితి చూసి బహుశా వారు తమ పిల్లలనూ మరచిపోయి ఉండవచ్చేమో ) రోగులకు సేవలు చేసే సమయంలో ఆంటోనియో వైరస్ బారిన పడ్డాడు. ఈ విషయం తెలిసినా సోఫియా , కరోనా రోగులకు సేవలు చేయడం మానలేకపోయింది. ఆంటోనియో కూడా ఆమెను అడ్డుకోలేదు. తమ ఉద్యోగ బాధ్యతను తమ కుటుంబ బంధాలకన్నా గొప్పదిగా భావించారు. ఒక వారం తర్వాత వైరస్ సోఫియాను కూడా తాకింది.హాస్పిటల్ లోని ఐసొలేషన్ వార్డులలో పడకలు ఖాళీ లేవు. సోఫియాకు కాసింత మెరుగైన వైద్యసేవలు తక్షణమే అందడంతో కోలుకునే పరిస్థితి. అయితే కొన్నాళ్ళ తర్వాత వార్డులో ఒకేఒక పడక ఖాళీగా ఉందని ,ఎవరో ఒకరికే అవకాశమని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. ఆంటోనియో , తన భార్యను అక్కడికి వెళ్ళమన్నాడు. కానీ ఆమె తన భర్తను ఒంటరిగా చావడానికి అంగీకరించలేదు. మరికొన్ని రోజులకు వారిద్దరూ ఒకరిచేతులనొకరు పట్టుకుని , ఒకరినొకరు చూసుకుంటూ , ఊరడించుకుంటూ చివరి శ్వాస వదిలేశారు.తమ పిల్లలను కౌగలించుకుని, ముద్దాడి,వీడ్కోలు చెప్పే అవకాశమే ఆ దంపతులకు లభించలేదు.
దంపతులేమో ఒకరినొకరు కోల్పోయారు.
కారా, లియా తమ తల్లిదండ్రులను కోల్పోయారు.
హాస్పిటలేమో దేశభక్తి కలిగిన నర్సులను కోల్పోయింది.
కారా, లియా తమ తల్లిదండ్రులను కోల్పోయారు.
హాస్పిటలేమో దేశభక్తి కలిగిన నర్సులను కోల్పోయింది.
ఆంటోనియో, సోఫియా లాంటివాళ్ళు తమ , తమవారి జీవితాలను ఫణంగా పెట్టి , మూర్ఖులైన ఎందరో మనలాంటివారిని కాపాడుతున్నారు. మనమేమో ఎంత చెప్పినా,హెచ్చరించినా విన్పించుకోకుండా రోడ్డు పట్టుకుని తిరుగుతున్నాము. ఇంట్లోనే ఉంటే, రోడ్డెక్కకపోతే చచ్చిపోతామేమోనన్నట్లు ఒకరినిచూసి మరొకరు బయట తిరుగుతున్నాము. మనం గనుక ఇంట్లోనే ఉంటే కరోనా వైరస్ ను ఆపగలం. కారా,లియా లాంటి పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలు కాకుండా అడ్డుకోగలం. సోఫియా, ఆంటోనియో లాంటి దేశభక్తులను, ఉద్యోగంపట్ల నిబద్ధత కలిగినవారిని కాపాడుకోగలం.
ఇంట్లో ఉండండి...దయ కలిగి ఉండండి...గొలుసును తెంచేయండి... కరోనాను అడ్డుకోండి.
( క్రింది చిత్రం సోఫియా, ఆంటోనియో హాస్పిటల్ లో పనిచేస్తున్నపుడు , ఆంటోనియోకు వైరస్ సోకడానికి కొన్ని రోజుల ముందునాటిది. బహుశా ఇదే తమ చివరిముద్దు అని ఆనాటికి వారికి అన్పించి ఉండకపోవచ్చు )
loading...
No comments:
Post a Comment