Latest News

అసలు ఇంట్లో బ్యాంబుట్రీ (వెదురు చెట్టు) ఎందుకు పెంచుతారో తెలుసా ..?

loading...

బ్యాంబుట్రీ దీనినే వెదురు చెట్టు అని కూడ అంటారు. ఇది గ్రీన్ కలర్ లో ఉంటుంది.

ఇది మన నవగ్రహాలలో బుథ గ్రహానికి చెందినది. బుదుడు వ్యాపార వృద్ది కారకుడు కావటం వలన ఇది వ్యాపార సంస్థలలో ఉంచితే వ్యాపారం దిన దినాభివృథ్ధి చెందుతుంది. వ్యాపార సంస్థలలో నరదిష్టికి ' ఆకర్షణకు , వ్యాపారభివృథ్థికి చాలా మంచిది .

విద్యకి,వాక్ శుద్దికి బుదుడు కారకుడు. పిల్లలు చదువుకొనే టేబుల్ దగ్గర ఉంచితే మంచి తెలివితేటలు ,చదువుపై శ్రద్ద, సరియైన సమయంలో (పరీక్ష సమయములలో ) గుర్తుకు వచ్చే ఆలోచనలు(క్రియేటివిటి). మంచి వాక్ ఫటిమ కలిగి భావ ప్రకటన చేయగలడు.

వెదురు మొక్క పెరుగుదలను ప్రత్యక్షంగా చూడటం వలన మనలో కూడ జీవితంలో ఉన్నత స్ధాయికి ఎదగాలనే భావన కలుగుతుంది.
ఇంటిలో ఏమైనా వాస్తు దోషాలు ఉన్న, వీధిపోటు ఉన్న ఇంటిలో సింహా ద్వారానికి ఎదురుగా ఉంచితే వీథిపోటు , చిన్న చిన్న వాస్తు దోషాలు నరదృష్టి , కనుదృష్టి, చెడు ఎనర్జీని తీసివేసి పాజిటివ్ ఎనర్జీని కలిగించి మంచి అన్యోన్నత , ఒకరిపై ఒకరికి ప్రేమానురాగాలు కలిగి ఎప్పుడు సుఖశాంతులు , థనాభివృద్దితో ఇల్లు కళకళ లాడుతుంది .

అదృష్టాన్ని తెచ్చిపెట్టే ఈ వెదురు మొక్కలు రకరకాల ఆకృతులలో రూపొందించిన గాజు , మట్టి పాత్రలలో ఉంచి తూర్పు,ఉత్తర,ఈశాన్య దిక్కుల యందు ఉంచి అప్పుడప్పుడు నీటిని మారుస్తూ ఉండాలి.

వెదురు మొక్కలను గృహాలకంరణలో భాగంగా చాలా మంది తమ ఇళ్లలో ‘ఇండోర్ మొక్కలుగా’ను పెంచుకుంటున్నారు. ‘
వెదురు మొక్కలను’ లక్కి ప్లాంట్స్‌గా అభివర్ణించుకుంటున్న పలువురు ఈ మొక్కలను ఇళ్లలో పెంచితే ‘ధన బలం’ పెరుగుతుందని విశ్వసిస్తున్నారు.

ఈ సంస్కృతి అలా అలా వ్యాపించటంతో ఇళ్లలోనే కాదు ఆఫీసుల్లోనూ, దుకాణ సముదాయాల్లో ఎక్కడ చూసిన ఈ మొక్కలే దర్శనమిస్తున్నాయి.

loading...

No comments:

Post a Comment

Teenmar News | Online English, Telugu,Telangana News Portal Designed by Templateism.com Copyright © 2014

Powered by Blogger.