Latest News

భద్రాచలం గుడి శిఖరం పై ఉన్న సుదర్శన చక్రం ఎవరో తయారు చేసారో తెలుసా...?

loading...

భద్రాచలం కోవెల శిఖరం, దాని పై ఉన్న సుదర్శన పెరుమాళ్ ఫోటోని అందరూ జాగ్రత్త పరుచుకుని , చక్కగా ఫ్రేమ్/ లామినేషన్ చేసి మీ మీ పూజా గృహంలో నిత్యం పూజించండి చాలా మంచిది. పైన ఉన్న సుదర్శన చక్రం ఎవరో మానవులు తయారు చేసినది కానీ కాదు సుమా. అది దేవతా నిర్మితమైనది. శ్రీ రామదాసు దేవాలయం నిర్మించే సమయంలో కారాగారంలో తురుష్కుల ద్వారా వుండవలసి వచ్చింది. చివరి భాగం ఈ సుదర్శన చక్రం స్థానం ఖాళీగా ఉండి పోయింది. 

శ్రీ రామదాసు కారాగారం లో ఉన్న సమయంలో అక్కడ ఉన్న అప్పటి ఆలయ పాలకులు వేరే కలశం అక్కడ ఉంచగా అది ప్రతి చిన్నపాటి గాలికి, వర్షానికి క్రింద పడిపోతు అస్తమాను అపచారం జరిగేది. ఈ సంఘటనకు అక్కడ ఉన్నవారంతా చాలా ఖేద చెందేరు. ఈ విషయం కారాగారం లో ఉన్న రామదాసుకు కూడా చేరి ఆయన అక్కడ అన్న పానాదులు ముట్టుకునే వారు కాదు. తదుపరి ఆయన కారాగారం నుండి బయటకు వచ్చాక ఆయన నిద్రలేని రాత్రుళ్ళు ఎన్నో గడిపారు. తర్వాత ఒక రోజు ఆయనకు స్వప్నము లో శ్రీ రాముల వారు ప్రత్యక్షమై ఆ ఆలయ శిఖరం పై పెట్టవలసిన సుదర్శన చక్రం తనకు గోదావరి నదిలో లభిస్తుందని చెప్పి అంతర్ధానం అయ్యారు భగవంతుడు. 

అంతే ఇంకేముంది మన రామదాసు తెల్లవారుజామున అందరికి సదరు విషయం చెప్పి తాను గోదావరిలో స్నానాకి వెళ్లి నీటిలో మునిగి పైకి లేవగానే ఆయన చేతిలో ఇప్పుడు మీరు చూస్తున్న సుదర్శన చక్ర సహిత పెరుమాళ్లు రెండు చేతులపై తెలియాడుతూ లభించింది.

ఇంక ఆనందంతో వేద మంత్రాలతో ఆదే రోజు శ్రీ వారి ఆలయ శిఖరం పై దానిని ప్రతిష్ట చెయ్యటం జరిగింది. అది ఈనాటికి అలాగే వుంది. మళ్ళీ శిఖరానికి అపశృతి అన్న మాట లేదు. సదరు విషయం తురుష్కుల హుకుమత్ కి కూడా తెలిసి ఆయన కూడా సీతా రాములవారిని దర్శించుకుని కానుకలు మొక్కులు చెల్లించుకొని. శ్రీ రామదాసుని బంధించి వుంచినందుకు మాఫీ కోరుకొని వెళ్లారుట ఆ జహాపాన. క్లుప్తంగా ఇది ఆ గోపురం మహత్తు. పై విషయం చదివిన ప్రతి వారికీ కూడా శ్రీ సీతారాముల వారి కృపా కటాక్షములు కలుగు గాకా. జై శ్రీరామ్. మంగళ మహాత్
loading...

No comments:

Post a Comment

Teenmar News | Online English, Telugu,Telangana News Portal Designed by Templateism.com Copyright © 2014

Powered by Blogger.