Latest News

మన పూర్వీకులు అసలు ముగ్గు ఎందుకు పెట్టేవారు ఆ ముగ్గుల అర్థం పరమార్థం ఎటి అనేది తెలుసుకుందాం

loading...


  • ఇంటి గడప ముందు ముగ్గులో భాగంగాగీసే రెండు అడ్డగీతలు ఇంటి లోనికి దుష్టశక్తులను రాకుండా నిరోధి స్తాయి.
  • ఇంట్లోఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళ కుండా చూస్తాయి.
  • ముగ్గువేసి దానికి నాలుగువైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే అక్కడ శుభ కార్యాలు, మంగళకరమైన పనులు జరుగుతున్నాయని గుర్తు! పండుగల సమయంలో ఈ విధంగా ఖచ్చితంగా వేయాలి.
  • ఏదేవతపూజచేస్తున్నా దైవాన్నిఉంచే పీట మీద మధ్యలో చిన్న ముగ్గు వేసినా నాలుగు వైపులా రెండేసి గీతలను తప్పక గీయాలి.
  • నక్షత్రం ఆకారం వచ్చేలా గీతలతో వేసిన ముగ్గు భూత, ప్రేత, పిశాచాలను ఆ దరిదాపులకు రాకుండా చూస్తుంది. అంతే కాదు, మనం వేసే పద్మాలు,చుక్కల ముగ్గులలో కూడా మనకుతెలీని అనేక కోణాలు దాగి ఉన్నాయి.అవి కేవలం గీతలే కాదు, యంత్రాలు కూడా!యంత్ర,తంత్ర శాస్త్ర రహస్యాలతో కూడి ఉండడం వలన మనకు హాని కలిగించే చెడ్డశక్తులను దరిచేరనీయవు. అందుకే ఏ ముగ్గునైనా తొక్కకూడదు.
  • తులసి మొక్క దగ్గర అష్టదళపద్మం వేసి దీపారాధాన చేయాలి!
  • యజ్ఞయాగాదులలో యజ్ఞగుండం
  • మీద నాలుగు గీతలతో కూడిన ముగ్గులేయాలి. దైవకార్యలలో కూడా నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి.
  • నూతన వధూవరులు తొలిసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టు ప్రక్కల లతలు, పుష్పాలు, తీగలతో కూడిన ముగ్గులు వేయాలి!
  • దేవతా రూపాలను, ఓం, స్వస్తిక్, శ్రీ గుర్తులను పోలిన ముగ్గులు వేయ కూడదు, ఒకవేళ వేసినా వాటిని తొక్కకూడదు.
  • ఏ స్త్రీ అయితే దేవాలయంలోనూ, అమ్మవారు,
  • శ్రీ మహావిష్ణు వు ముందు నిత్యం ముగ్గులు వేస్తుందో, ఆస్త్రీకి ఏడు జన్మలవరకు వైధవ్యం రాదని, మరియు సుమంగళిగానే మరణిస్తుందని దేవీ భాగవతం, బ్రహ్మాండపురాణం చెబు తున్నాయి.
  • పండుగ వచ్చింది కదా అని, నడవ డానికి చోటు లేకుండా వాకిలంతా ముగ్గులు పెట్టకూడదు!
  • ముగ్గులు రోజు వేయలేక పెయింట్ పెట్టేస్తాము.దాన్ని ముగ్గుగా శాస్త్రం అంగీ కరించదు. ఏరోజుకారోజు బియ్యపు పిండి తో ముగ్గు పెట్టాలి!
  • నిత్యం ఇంటి ముందు, వెనుక భాగంలో, తులసి మొక్క దగ్గర దీపా రాధన చేసే ప్రదేశంలో ముగ్గు వేయాలి.
  • ముగ్గు పాజిటివ్ / దైవ శక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుంది.
  • ముగ్గులు శుభసూచకాలుగా పని చేస్తాయి.
  • పూర్వం రోజూ సాధువులు,సన్యాసులు బ్రహ్మచారులు ఇల్లిల్లూ తిరిగి బిక్ష అడిగే వారు.ఏఇంటిముందైనా ముగ్గులేదంటే ఆ ఇంటికి వేళ్ళేవారు కాదు. వారే కాదు అడ్డుక్కునే వారు కూడా ముగ్గు లేని ఇళ్ళకు వెళ్ళి అడ్డుక్కునే వారు కాదు.
  • ముగ్గు లేదంటే అక్కడ అశుభం జరిగిందని గుర్తు! అందుకే మరణించి న వారికి శ్రాద్ధకర్మలు చేసే రోజున ఉదయం ఇంటిముందు ముగ్గువేయరు. శ్రాద్ధకర్మ పూర్తైన వెంటనే, అది మధ్యా హ్నమైనా ముగ్గు వేస్తారు.
  • ముగ్గులు వెనుక సామాజిక, మానసిక, ఆరోగ్య, ఆధ్యాత్మికమైన అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయి.మనం ఆచరించే ఏఆచారమూ మూఢనమ్మకం కాదు. మన ఆచార, సంప్రదాయాలన్నీ అనేకా నేక అర్ధాలు, పరమార్ధాలతో కూడినవి
loading...

No comments:

Post a Comment

Teenmar News | Online English, Telugu,Telangana News Portal Designed by Templateism.com Copyright © 2014

Powered by Blogger.