loading...
'భగిని’ అంటే...చెల్లెలైనా కావచ్చు., అక్క అయినా కావచ్చు.‘హస్తభోజనం’ అంటే... చేతి భోజనము అని అర్ధం. అంటే.. సోదరిచేతి వంట సోదరుడు తినడం అన్నమాట. ఇందులో కొత్త విషయం ఏముందని మీరు అడగచ్చు. సాధారణంగా వివాహమైన చెల్లలు, అక్క ఇంటిలో తల్లిదండ్రులుగానీ., అన్నదమ్ములుగానీ భోజనం చేయడానికి ఇష్టపడరు. కారణం తినకూడదని కాదు. ఆడపిల్ల ఋణం ఉంచుకోవడం పుట్టింటివారికి ఇస్టం ఉండదు. శుభసందర్భాలలో., శుభకార్యాలలో వచ్చి భుజించినా తప్పులేదు కానీ., ఊరికే వచ్చి తినడం మర్యాద కాదని మన సాంప్రదాయం. కానీ., కార్తీక శుద్ధ విదియనాడు మాత్రం వివాహం అయిన సోదరి ఇంటిలో సోదరుడు భుజించి తీరాలని శాస్త్రం నిర్ణయించింది. దీనికి ఓ కథ కూడాఉంది.

loading...
No comments:
Post a Comment