loading...
మెగాస్టార్ చిరంజీవి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. వెండితెరపై మెగాస్టార్ గా ఓ వెలుగు వెలిగిన చిరంజీవి ప్రస్తుతం తన రాజకీయ భవిష్యత్తుకోసం పావులు కదుపుతున్నారు. పవన్ స్థాపించిన జనసేన కంటే టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. విభజనతో కకావికలైన కాంగ్రెస్ పార్టీలో తన భవిష్యత్తు ఉండదేమోనని భావించిన చిరంజీవి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తోనే భేటీ అయినట్టు పొలిటికల్ వర్గాల సమాచారం. ఎలాగూ రాజ్యసభ సభ్యత్వం ఉండడంతో టీడీపీలో ఎలాంటి పదవులు అవసరం లేదని అన్నట్లు పబ్లిక్ టాక్.
మరోవైపు చిరంజీవి రాకను టీడీపీ స్వాగతిస్తుంది. ఆయన పార్టీలోకి వస్తే ముద్రగడ పద్మనాభం కు చెక్ పెట్టొచ్చు.ఇటు కాపుల మద్దతు కూడగట్టుకోవచ్చని ప్లాన్. అయితే ఈ వార్తకు ఊతమిస్తూ ప్రైవేటు సంస్థలైన మెగాస్టార్ చిరంజీవి తనయుడు రాంచరణ్ బోర్డు డైరెక్టర్ గా ఉన్న ట్రూ జెట్ సంస్థ బ్రాండ్ టర్బో మెగా ఎయిర్ వేస్ సంస్థకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) కింద ఏపీ ప్రభుత్వం రూ. 4.90కోట్లు మంజూరు చేసింది. విజయవాడ - కడప, విజయవాడ - తిరుపతి మధ్య వారంలో నాలుగు రోజులపాటు ప్రయాణికులు ఉన్నా లేకున్నా సర్వీసులు నిర్వహిస్తున్నందుకు జరిగే నష్టాన్ని భరించేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. ప్రస్తుతం 72 సీట్ల సామర్ధ్యం ఉన్న ఏటీఆర్ - 72 విమానాలను ట్రూ జెట్ నడుపుతోంది. ప్రతి సర్వీసులో ఐదు సీట్లను ఈ సంస్థ ప్రభుత్వానికి కేటాయిస్తోంది. ఏడాదిలో 672 సర్వీసులు నడిపినందుకు గాను ప్రభుత్వం రూ.9.76 కోట్లు చెల్లించాల్సి ఉండాగా.. తొలి విడత నష్టపరిహారంగా రూ. 4.90 కోట్లను ప్రభుత్వం చెల్లించింది.
ఇక చిరంజీవి 150వ సినిమా ఖైదీ నెంబర్ 150వ సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే ఆ సినిమా షూటింగ్ ముగిసిన వెంటనే డిసెంబర్ 5వ తేదీన మంచి ముహూర్తం ఉందని.. ఆ రోజు విజయవాడకు వచ్చి అమరావతిలో టీడీపీ తీర్థం పుచ్చుకుంటానని చిరంజీవి లోకేష్‌కు చెప్పినట్లు తెలుస్తోంది.
loading...
No comments:
Post a Comment