Latest News

ప్రతి తల్లీ, దండ్రీ తెలుసుకోవలసిన విషయం..!!

loading...
పుష్పవతి..పెద్దమనిషి..కూర్చుంది..పని పెట్టింది..మెట్యూర్ అయ్యింది..ముట్టు..బయటుంది ..జాడీ పగిలింది...ఇంకా ఇంకా ఇంకా ఎన్నో అనవసరపు మాటలు..అటు ఇంట్లో ఇటు బయటా అందరూ..!!
అప్పుడే అయ్యిందా అని పదేళ్ల పాపని ..ఇంకా అవ్వలేదా అని పద్నాలుగు దగ్గర పడుతున్న పిల్లని ..అందరికీ అవసరమైన అనవసరపు కుతూహలం...ముసుగేసుకున్న హాలాహలం.!!
మొదటి సారి ఊరంతా టామ్ వేసి..పండగ చేసి..పట్టు బట్టలు కట్టి ..ఆ తర్వాత నెల నుండి "ఛీ ముట్టు గుడ్డలు..పాడ్స్ ప్యాకెట్ ఎవరికీ కనపడనీయకు"..అనే మన సంస్కృతి ..భేష్ ..
అందరికీ sms లు వాట్సాప్ లు చేసినప్పుడు లేని సిగ్గు..సూపర్ మార్కెట్ లో మన ఫ్లో కి తగ్గ పాడ్ మనం సెలెక్ట్ చేసుకుంటే "సిగ్గు లేదు త్వరగా కానియ్యి" అనే లోకం..
అప్పటివరకు ఎప్పుడు వెళ్లినా కాడ్బరీ చాకోలెట్ ఇచ్చే మెడికల్ షాప్ అంకుల్..కేర్ఫ్రీ ప్యాకెట్ ని న్యూస్పేపర్ లో చుడుతూ మాత్రం ఆ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడటం.."మార్పు నా లో వచ్చింది అంటున్నారు..మరి అంకుల్ కి ఏమయ్యింది"..ఈడ ఒక బూతు వాడచ్చు..మీకే వదిలేస్తున్నా
ఊరందరికీ చెప్పే విషయం లో వున్న ఉత్సాహం ముందు అమ్మాయిలకి శరీరం లో సహజ సిద్ధం గా వచ్చే మార్పుల గురించి చెప్పాల్సిన శ్రద్ధ తల్లీ తండ్రి చూపిస్తే చాలు ..
స్కూల్ లో నో స్నేహితులనుండో పీరియడ్ ..ప్యూబర్టీ వంటి విషయాలు అంటే ఏంటో తెలిసిన పిల్లలని చూసి నోళ్లు నొక్కుకునే వారూ లేకపోలేదు..
నువ్వూ చెప్పక బడిలోనూ చెప్పక..ఎలా ..?
పాడ్స్ మార్చుకోవటానికి సరైన టాయిలెట్స్ లేక...
సరైన పాడ్స్ లేక బస్సుల్లో సైకిళ్ళ మీద లీక్ అయ్యి బట్టలుమరకలు..అవి దాచుకోలేక పడే అగచాట్లు ..పడే అవమానాలు..ఇంక కడుపు నొప్పితోనో ..బయం వల్లో స్కూళ్ళు మానేసే పిల్లలు ..మళ్లీనా అని చూసే చుట్టూతా ఉన్నవారి విసుగ విస్మయం
**ఇంకో సారి క్రికెట్ చూస్తూ. "బ్లీడ్ బ్లూ " అన్నప్పుడు ఒకసారి గుర్తు తెచ్చుకోండి ..నిజం గా ఆ "బ్లూ ".. సిరీస్ అయ్యే వరకు bleed అయితే ..దేనితో ఆపుకుంటారో అభిమానులు ..ఏ కాటన్ తోనే గా ..పాడ్స్ తోనే గా ..!!
ఎంతో నాచురల్ అయిన విషయాన్నీ ఆడ పిల్ల ఆత్మ విశ్వాసాన్ని అణగదొక్కే మెంటాలిటీ గా ఏదో ఒక లెవెల్లో ఈరోజుల్లో కూడా ఇంకా వుంది
loading...

No comments:

Post a Comment

Teenmar News | Online English, Telugu,Telangana News Portal Designed by Templateism.com Copyright © 2014

Powered by Blogger.