Latest News

రైల్వే ట్రాక్స్ కింద‌, చుట్టూ కంక‌ర రాళ్ల‌ను ఎందుకు పోస్తారో తెలుసా..?

loading...
రైలు ప‌ట్టాల ప‌క్క‌న మీరెప్పుడైనా న‌డిచారా..? న‌డిచాం… అయితే ఏంటంటారా..? ఏమీ లేదండీ… రైలు ప‌ట్టాల ప‌క్క‌న కంక‌ర రాళ్ల‌పై న‌డుస్తుంటే నిజంగా అదోలాంటి ఫీలింగ్ కలుగుతుంది. య‌మ వేగంగా దూసుకువ‌చ్చే రైళ్ల చ‌ప్పుడుకు ఆ స‌మ‌యంలో హ‌డ‌లిపోతాం. అయినా ట్రాక్‌పై ఉండే రాళ్ల మీద న‌డ‌వడం అంత ఆషామాషీ కాదు. అయితే… నిజానికి అస‌లు ట్రెయిన్ ట్రాక్స్ మ‌ధ్య‌లో, ప‌క్క‌న, చుట్టూ… ఆ మాట కొస్తే ట్రాక్ మొత్తం కంక‌ర రాళ్ల‌తో ఎందుకు నిండి ఉంటుందో తెలుసా..? అస‌లు కంక‌ర రాళ్ల‌ను ట్రాక్స్ కింద ఎందుకు పోస్తారో, వాటిని క్ర‌మ‌బ‌ద్దంగా ఎందుకు అమ‌రుస్తారో తెలుసా..? అదే తెలుసుకుందాం రండి..!
రైలు ట్రాక్ కింద‌, చుట్టూ ఉండే కంక‌ర రాళ్ల‌ను బ‌ల్లాస్ట్ అంటారు. అయితే ఇప్పుడంటే ట్రాక్స్ మ‌ధ్య‌లో కాంక్రీట్ దిమ్మ‌ల‌ను ఏర్పాటు చేస్తున్నారు కానీ, ఒక‌ప్పుడు చెక్క దిమ్మ‌లు ఉండేవి. ఈ క్ర‌మంలో కాంక్రీట్ అయినా, చెక్క దిమ్మ‌లైనా, వాటిని చిత్రంలో ఇచ్చిన విధంగా స్లీప‌ర్స్‌తో ఒక‌దానికొక‌టి ఫిట్ చేస్తారు. దాంతోపాటు ప‌ట్టాల‌కు దిమ్మ‌ల‌ను కూడా అమ‌రుస్తారు. అయితే ఇలా అమ‌ర్చాక ఆ దిమ్మ‌లు, ప‌ట్టాలు స‌రైన పొజిష‌న్‌లో ఉండేందుకు గాను చుట్టూ, కింద కంక‌ర రాళ్ల‌ను పోసి వాటిని స‌మం చేస్తారు. దీంతో ప‌ట్టాలు, దిమ్మ‌లు, స్లీప‌ర్స్ ఒకే స్థానంలో ఫిక్స్ అయి ఉంటాయి. అవి అటు, ఇటు క‌ద‌ల‌వు.
మ‌రి… ప‌ట్టాల ప‌క్క‌న కూడా కంక‌ర రాళ్లను పోస్తారు క‌దా… అంటే అందుకూ కార‌ణం ఉంది. సాధార‌ణంగా రైల్వే ట్రాక్ మొత్తం భూమిపై కొంత ఎత్తులో కంక‌ర రాళ్ల మీద ఏర్పాటు చేయ‌బ‌డి ఉంటుంది. దానికి తోడు ట్రాక్స్ ప‌క్క‌న ఎత్తుగా కంక‌ర‌ను పోస్తారు. అలా పోయ‌డం వ‌ల్ల వ‌ర్షం ప‌డిన నీరు సుల‌భంగా భూమిలోకి వెళ్లిపోతుంది. ట్రాక్‌పై నీరు నిల‌వ‌దు. దీంతో రైళ్లు సుల‌భంగా వెళ్ల‌వ‌చ్చు. వ‌ర‌ద‌కు ట్రాక్‌ కొట్టుకుపోకుండా ఉండేందుకు కూడా అలా కంక‌ర రాళ్ల‌ను ఏర్పాటు చేస్తారు. అలా చేయ‌డం వ‌ల్ల మొక్క‌లు కూడా పెర‌గవు. కింద చెత్త పేరుకుపోదు. ట్రాక్స్ క్లియ‌ర్‌గా క‌నిపిస్తాయి.
loading...

No comments:

Post a Comment

Teenmar News | Online English, Telugu,Telangana News Portal Designed by Templateism.com Copyright © 2014

Powered by Blogger.