loading...
భద్రాచలం లో మూలమూర్తులకు కూడా కళ్యాణం జరుగుతుందని తెలుసా? మూల మూర్తికి వివాహం అన్నది ప్రపంచములో మరెక్కడా లేదు ఒక్క భద్రాచలం లో తప్ప.
ఔరంగజేబు కాలంలో ఆతని సైన్యం భద్రాద్రి రామయ్య మీద కూడా దండెత్తారు...అప్పుడు అక్కడి అర్చకులు ప్రదర్శించిన ధైర్య సాహసాలు ఎనలేనివి. ఔరంగజేబ్ సైన్యం వస్తున్నది అని వార్త తెలియగానే, "కాకుళ్ళ రామానుజాచార్యులు" అనే స్వామి ఆలోచించి వెంటనే మూల వరులకు ముందు అడ్డంగా, వారు కనపడకుండా ఒక గోడ కట్టించేసారు... ఉత్సవార్లను, మిగిలిన పరివార విగ్రహాలనూ ఒక పెట్టె లో పెట్టి గోదావరి నదిలో ఒకచోట భద్ర పరిచి, అక్కడ ఒక రహస్య గుర్తు ఏర్పాటు చేసుకున్నారు... దండయాత్ర అయిపోయి అంతా మామూలు అయ్యాక మూల విగ్రహాల ముందు కట్టిన గోడ పడగొట్టించారు.గోదావరిలో ఉన్న ఉత్సవ విగ్రహాలను బయటకు తీయగా అందులో అందరూ ఉన్నారు గానీ సీతమ్మ కనపడలేదు.అది బ్రహ్మోత్సవ సమయం... సీతమ్మ లేకుండా కళ్యాణం ఎలా చేయాలి అని ఆలోచించి ఇక ఆ ఆప్షన్ లేదు కనుక మూల మూర్తులకు కళ్యాణం చేసారు... తరువాత సీతమ్మ విగ్రహం దొరకినా, మూలమూర్తుల కళ్యాణం ఆ నాడు పూర్వాచార్యులు రామయ్యని రక్షించడానికి చేసిన త్యాగానికి, శ్రమకీ గుర్తుగా ప్రతిఏటా చేయడం ఒక ఆనవాయితీగా ఉంటోంది.
loading...
No comments:
Post a Comment