Latest News

వైస్రాయ్‌లో హరికృష్ణ బాబువైపే ఎందుకు నిలబడ్డారు?

loading...


జామాతా దశమ గ్రహ: అని అంటారు. గ్రహాలు తొమ్మిదైతే అల్లుడు పదో గ్రహమని దానికి అర్థం. నందమూరి వంశానికి అలాంటి గ్రహం ఒకటి ఉందని, అది వారిని జీవితాంతం వెంటాడుతూ ఉంటుందని పాతికేళ్ల పరిణామాలను చూస్తే అర్థమవుతుంది. ఆ గ్రహం ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నందమూరి హరికృష్ణ ఆ గ్రహం కబళించిన గాఢ క్రీనీడలో ఒకరు మాత్రమే.

హరికృష్ణ శాపగ్రస్తుడని అంటారు. దీనికి కారణలు అనేకం. ఆంధ్రుల అభిమాన నటుడు ఎన్టీఆర్‌కు నటవారసుడని అనిపించుకుంటాడన్న ఆశను హరికృష్ణ నిజం చేయలేకపోయారు. తండ్రిలా స్ఫురద్రూపి కాకపోవడం, నటించిన సినిమాల్లోనూ చిన్నపాత్రల్లోనే కనిపించడంతో జనం పట్టించుకోలేదు. తమ్ముడైన బాలయ్యను పట్టించుకున్నారు.ఎన్టీఆర్ రాజకీయాల్లో వచ్చేశారు. హరికృష్ణ ‘చైతన్య రథ’ సారథి అయ్యారు. ఎన్నికల్లో పచ్చజెండా రెపరెపలాడింది.తారకరాముడు సీఎం అయ్యారు. కానీ సారథి మాత్రం ఎవరికీ కనిపించలేదు. అల్లుడు చంద్రబాబు చక్రం తిప్పడం మొదలుపెట్టారు. అందిస్తే మొత్తం అల్లుకుపోయారు. లక్ష్మీపార్వతి అతిపెత్తనం కూడా బాబు వ్యూహాలకు సదవకాశం కల్పించింది. మామపై చెప్పులు. వైస్రాయ్ హోటల్‌లో ఎమ్మెల్యేల క్యాంప్ కథ సాగింది. రాజకీయానికి తెరతీసి ఆంధ్రుల అభిమాన నటుణ్ని పదవికి దూరం చేశారు. అధికారాన్ని అందిపుచ్చుకున్నారు.

తండ్రికి అండగా ఉండాల్సిన ‘సారథి’ ఏం చేశాడు?

హరికృష్ణకు మొదటి రాజకీయాలపై పట్టులేదు. తండ్రి చెప్పినట్లు నడుచుకునేవారు. తండ్రికి భావోద్వేగాలేతప్ప అసలు సిసలు రాజకీయాలు చేతకావని అచ్చం బావలాగే ఆలోచించాడు. సినిమాలు కాకుండా రాజకీయాలే రాష్ట్రాన్ని, ప్రజలను శాసిస్తాయని, బాబు వెంట జీ హుజూర్ అని నిలవడం తప్ప మరో గత్యంతరం లేదని అనుకున్నారు. ‘పిన్ని’ లక్ష్మీపార్వతిపై విముఖత బావపై సముఖతకు దారితీసింది. నందమూరి వంశానికి దారిచూపేది నారా అని గుడ్డిగా నమ్మేశారు. ఫలితం.. తండ్రిపై చెప్పులు పడుతున్నా అడ్డుకోలని దైన్యం..  యస్..బాస్ తరహాలో యస్.. బావా.. అనాల్సిన అగత్యం. ఒక్క హరికృష్ణే కాదు, బాలకృష్ణ అయినా, మరే నందమూరి కృష్ణ అయినా, రావు అయినా… నారా బాబు అడుగులకు మడుగులు వొత్తాల్సిందే. తండ్రికి ద్రోహం చేసిన మనిషితోనే కరచాలనం చేయాల్సిన విషాదం!!

అన్నా టీడీపీ..

కానీ తండ్రి నుంచి రక్తంతోపాటు అందిన ఆత్మాభిమానం ఊరుకోదుకదా. హరికృష్ణలో తిరుగుబాటు ఉంది, ఖలేజా ఉంది. అందుకే  1999లో.. ఆలస్యంగా.. బాబుకు ఎదురు తిరిగి అన్నా టీడీపీ పార్టీని స్థాపించాడు. కానీ అప్పటికే రాష్ట్రాన్ని రెండు రాజకీయ శిబిరాలు ఆక్రమించేసి ఉన్నాయి. టీడీపీ, లేదంటే కాంగ్రెస్. మరో పార్టీకి నో చాన్స్. మరోపక్క కుటుంబం నుంచి నిరాశ. తోడబుట్టినవాళ్లు కూడా తోడు రాలేదు. బావే సర్వస్వం అన్నారు. హరికృష్ణ కమ్యూనిస్టులతో పొత్తుపెట్టున్నాడు. ఘోరంగా ఓడిపోయారు.. మళ్లీ బావనే శరణువేరు. పార్టీకి నందమూరి సెంటిమెంట్ కావాలి కనుక బావ చిద్విలాసంగా నవ్వు అక్కున చేర్చుకున్నారు. రాజ్యసభ సీటు, పొలిట్‌బ్యూరో మెంబర్, మంత్రి పదవి.. బస్! అంతకుమించి ఎదగనివ్వలేదు. ఎదగగానికి హరికృష్ణ కూడా ప్రయత్నించలేదు. ఒక మాటలో చెప్పాలంటే టీడీపీ సమర్పించే రాజకీయ చిత్రంలో క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్ర..!! క్యారెక్టర్ ఆర్టిస్టులను హీరోలుగా చూడ్డానికి జనం ఇష్టపడరు!
loading...

No comments:

Post a Comment

Teenmar News | Online English, Telugu,Telangana News Portal Designed by Templateism.com Copyright © 2014

Powered by Blogger.