Latest News

గూగుల్ పే గా మారిన తేజ్ యాప్ ప్రయోజనాలు

loading...



ప్రముఖ సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ గత సంవత్సరం సెప్టెంబర్ లో తేజ్ చెల్లింపు యాప్ ను భారతదేశంలో ప్రారంభించింది. అమెరికాకు చెందిన గూగుల్ ఇప్పుడు ఈ యాప్ కు భారీ ప్రోత్సాహాన్ని ఇవ్వాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా తేజ్ యాప్ పేరును గూగుల్ పే గా మార్చింది. ఆసియా ఖంఢంతో పాటు దాని చుట్టుపక్కల ఉన్న ఇతర ప్రాంతాలకు ఈ యాప్ ను విస్తరించడానికి సిద్ధం అవడంతో రిటైల్ రంగంలో ఒక పెద్ద సంచలనానికి గూగుల్ తెరతీయనుంది. దీనితో, ప్రపంచవ్యాప్తంగా 20 దేశాలలో అందుబాటులో ఉన్న గూగుల్ గ్లోబల్ చెల్లింపు సేవలతో ఈ యాప్ చేరనుంది.

గూగుల్ పే వినియోగదారులు చెల్లింపు చేసే మరిన్ని ప్రదేశాలు :

గూగుల్ పే సహాయంతో చెల్లించే ప్రదేశాల సంఖ్యను కూడా గూగుల్ విస్తరించనుంది. మొబైల్ యాప్స్, వెబ్ సైట్స్, అలాగే బ్రాండెడ్ రిటైల్ దుకాణాలలో ఈ యాప్ ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆన్ లైన్ చెల్లింపులలో భాగంగా, మీరు ఇప్పటికే గోఐబిబో, ఫ్రెష్ మెనూ, రెడ్ బస్ తో పాటు మరో రెండు వేల ఇతర యాప్ లు, ఆన్ లైన్ సైట్లలో సురక్షితమైన చెల్లింపులు చేయడం కోసం గూగుల్ పే ను ఉపయోగిస్తున్నారు. రానున్న కొద్ది రోజుల్లో, గూగుల్ తన చెల్లింపు ప్లాట్ ఫారంకు మరికొందరు పార్ట్నర్ లను జోడించనుంది.


గూగుల్ అతి పెద్ద దుకాణాలతో పనిచేస్తుందని, అందువలన వినియోగదారులు భారతదేశంలోని అన్ని పెద్ద రిటైల్ దుకాణాల్లో గూగుల్ పే ద్వారా చెల్లింపులు చేయవచ్చునని తమ అధికారిక బ్లాగ్ స్పాట్ లో తెలిపింది. ఈ ఏడాది తర్వాత, గూగుల్ పే వినియోగదారులు బిగ్ బజార్, ఈ-జోన్, ఎఫ్బీబీ వంటి రిటైల్ దుకాణాలలో చెల్లింపులు చేయవచ్చునని గూగుల్ తెలిపింది.

కేవలం రిటైల్ రంగంలోనే కాకూండా, సూక్ష్మ-రుణాల ప్రపంచంలో కూడా గూగుల్ చెల్లింపుల సర్వీస్ అడుగు పెట్టనుంది. దీనితో ఇది జస్ట్ మనీ వంటి స్టార్ట్ అప్ సంస్థలకు పోటీదారుగా మారనుంది.

రుణాల కోసం గూగుల్ బ్యాంకులతో చేతులు కలిపింది :

గూగుల్ యాప్ ద్వారా సెకండ్ల వ్యవధిలో వినియోగదారులకు ముందుగా ఆమోదించిన రుణాలను అందించడానికి హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్ వంటి పలు భారతీయ బ్యాంకులతో గూగుల్ భాగస్వామిగా ఉంది. ఇందులో రుణ మొత్తం చిన్నదిగా ఉంటుంది. గరిష్టంగా ఎంత మొత్తాన్ని రుణంగా అందిస్తారో ప్రస్తుతానికి ఇంకా తెలియదు. ఒకసారి బ్యాంక్ ఆమోదించిన తర్వాత, రుణ మొత్తం సురక్షితంగా, తక్షణమే బ్యాంకు ఖాతాలోకి జమ అవుతుంది.
loading...

No comments:

Post a Comment

Teenmar News | Online English, Telugu,Telangana News Portal Designed by Templateism.com Copyright © 2014

Powered by Blogger.